
టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజులో హిట్ అవుతుంటాయి. అలాంటి మూవీస్ లిస్ట్ తీస్తే అందులో డబ్బింగ్ చిత్రం 'బిచ్చగాడు' కచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గా దీని సీక్వెల్ 'బిచ్చగాడు 2' థియేటర్లలోకి రాగా, ఇది మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో కలెక్షన్స్ బాగానే సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.
మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. తెలుగులో శ్రీకాంత్ 'మహాత్మ' మూవీకి సంగీతమందించాడు. పేరు కూడా తెచ్చుకున్నాడు. కొన్నాళ్లకు 'నకిలీ' మూవీతో హీరోగా ఎంట‍్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అంటే 2016లో 'బిచ్చగాడు' చేసిన విజయ్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నాడు. తమిళంలో ఏమోగానీ తెలుగులో ఎవరూ ఊహించని రేంజులో ఈ మూవీ హిట్ అయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.
దీంతో తనకు అచ్చొచ్చిన 'బిచ్చగాడు'నే విజయ్ ఆంటోని నమ్ముకున్నాడు. సీక్వెల్ లో హీరోగా నటించి, మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్.. ఇలా అన్ని బాధ‍్యతల్ని తానే చూసుకుని ఫైనల్ గా హిట్ కొట్టాడు. జూన్ 18 నుంచి అంటే ఈరోజు(ఆదివారం) నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంకెందుకు లేటు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.
Vijay Gurumoorthy is here now! #Bichagadu2 is streaming now on #DisneyPlusHotstar. #Bichagadu2OnHotstar. @vijayantony @iYogiBabu @KavyaThapar pic.twitter.com/vU7tWi43V3
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 18, 2023
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!)