![Vijay Antony Sign 3 Films for Infinity Film Ventures - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/12/vijay-antonu.jpg.webp?itok=Ra7X0KlI)
పిచ్చైక్కారన్ –2(బిచ్చగాడు 2) చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొలై. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి నాయకిలుగా నటించారు. గిరీష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సోమవారం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి, కలైపులి ఎస్. ధాను, సత్య జ్యోతి త్యాగరాజన్, అమ్మ క్రియేషన్స్ శివ ,దర్శకుడు విజయ్, లింగుసామి, మిష్కిన్, నటుడు జాన్ విజయ్, నటి మీనాక్షి చౌదరి, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తి వెల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ వేదికపై నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థను ప్రారంభించడానికి ముఖ్య కారణం నటుడు విజయ్ ఆంటోనీ అని పేర్కొన్నారు. ఈ సంస్థలో వరుసగా మూడు చిత్రాలు చేద్దామని ఆయనే తమను ప్రోత్సహించారని తెలిపారు. ఆ విధంగా కొలై చిత్రం, తర్వాత రత్తం, ఆ తర్వాత మలై పిడిక్కాద మనిదన్ చిత్రాలు తమ సంస్థ నుంచి వరుసగా విడుదల కానున్నాయని చెప్పారు. ఇలా విజయ్ ఆంటోనితో వరుసగా చిత్రాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు బాలాజీ కుమార్ దీన్ని ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన బడ్జెట్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించినట్లు ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ విషయాలు చోటుచేసుకుంటాయని ధనుంజయన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment