
అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కన్నడలో కథానాయకునిగా నటిస్తున్న ఆయన తెలుగు, తమిళ భాష చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఇటీవల విడుదలైన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్‌కి తండ్రి పాత్రలో కనిపించారాయన. తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కిన ‘ఇరుంబు దురై’ సినిమాలోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర చేశారు. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. విజయ్ ఆంటోనీ హీరోగా నూతన దర్శకుడు ఆండ్రు ‘కొలైక్కారన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. అంటే.. హంతకుడు అని అర్థం. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకి అర్జున్‌ని సంప్రదించాయట చిత్రవర్గాలు. మరి.. హంతకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.