దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్‌ ఆంటోనీ | Vijay Antony Begins Promotions For Ratham Movie After His Daughter Meera's Death - Sakshi
Sakshi News home page

Vijay Antony: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్‌.. ఫోటోలు వైరల్‌

Published Fri, Sep 29 2023 8:19 AM | Last Updated on Fri, Sep 29 2023 9:33 AM

Vijay Antony And His Movie Promotion - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట ఈ మధ్య జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే.. 16 ఏళ్ల వయసులోనే ఆయన కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. కూతురు చనిపోవడంతో విజయ్ ఎంతగానో కృంగిపోయాడు. ఈ బాధలో ఇప్పటి వరకు కనీసం ఆయన బయటకు కూడా రాలేదు. తన కుటుంబ సభ్యులు సరిగ్గా భోజనం కూడా చేయడంలేదని ఆయన సన్నిహితులు తెలిపారు.  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంతటి దు:ఖంలోనూ ఆయన తన తోటీ నటీనటులు, దర్శకనిర్మాతల కోసం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

(ఇదీ చదవండి; థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ సినిమా)

సాదారణంగా చాలామంది నటీనటులు సినిమా షూట్‌ పూర్తి అయిన తర్వాతో ఎదో కారణం చెప్పి సినిమా ప్రమోషన్లుకు రాకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటారు. కానీ కన్నకూతురు చనిపోయినా తన సనిమా విడుదల దగ్గర్లో ఉండటంతో ఆయన నిర్మాతల గురించి ఆలోచించి తన చిన్న కూతురుతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కూతురును కోల్పోయిన పది రోజుల్లోనే విజయ్‌ ఆంటోనీ ఆ బాధను దింగమింగుకుని మరీ.. తన సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడం అందరినీ ఆలోచింప జేసేలా చేసింది. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో విజయ్​ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారని తెలిసింది.

విజయ్‌ హీరోగా సీఎస్‌ ఆముదన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'రత్తం'. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు విడదల విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. విజయ్‌ పరిస్థితిని చూసి ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసేందుకు రెడీ అయ్యారు. అలా చేస్తే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని విజయ్‌  ఈ సినిమాను ముందుగా అనుకున్న అక్టోబరు 6న రిలీజ్ చేయండి అని చెప్పారట.

అందుకు అంగీకరించిన మూవీ టీమ్​ చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్​ను తాజాగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్‌ ఆంటోనీ తన రెండో కూతురితో కలిసి పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్​ నిబద్ధత కలిగిన నటుడంటూ ప్రశంసిస్తున్నారు.  ఈ సినిమా తమిళ్‌లో మాత్రమే విడుదల అవుతుంది. త్వరలో తెలుగులో కూడా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement