
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉంది. మీరాతో పాటు తాను కూడా మరణించానని ఆయన తెలిపాడు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ చనిపోతే ఏ తండ్రి అయినా పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కుటుంబం మొత్తం ఇంత దుఃఖంలో ఉన్నా తన కొత్త సినిమా 'రత్తం' విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలకృష్ణ)
దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని ఆయన భావించాడట. ముందుగా అనుకున్న సమయానికే చిత్రం అక్టోబర్ 6న తమిళ్‌లో విడుదలవుతోందని మేకర్స్ ప్రకటించారు.తెలుగు వర్షన్ విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్ ఆంటోనీ భావించారట.
చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపించనున్నారు విజయ్. చెన్నైలో జరిగిన ఈ వరుస హత్యల కారణంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కొందరు మంత్రుల రాజీనామాకు కూడా దారితీసింది.
ఈ సన్నివేశాల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మీడియా, రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment