‘విజయ్‌తో చేయాలనుంది’ | Ashima Narwal Special Interview | Sakshi

‘విజయ్‌తో చేయాలనుంది’

Jul 21 2019 2:02 PM | Updated on Jul 21 2019 2:02 PM

Ashima Narwal Special Interview - Sakshi

దళపతి విజయ్‌కు జంటగా నటించాలనుందని అంటోంది నటి ఆషిమా నార్వల్‌. ఉత్తరాది బ్యూటీస్‌ కోలివుడ్‌లో నటించాలని కోరుకోవడం అన్నది సర్వసాధారణంగా మారింది. అందుకు నటి ఆషిమా నార్వల్‌ అతీతం కాదు. ఇప్పటికే కొలైక్కారన్‌ వంటి హిట్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మిస్‌ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీని పలకరించగా తాను సినీరంగంలోకి ఎలా ఎంటర్‌ అయ్యింది, వ్యక్తిగత జీవితం వంటి పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం.

మీ గురించి చెప్పండి?
నేను పుట్టింది ఇండియాలోనేనైనా ఉన్నత విద్యను చదివింది మాత్రం ఆస్ట్రేలియాలో. సైన్‌టిస్ట్‌ కావాలని కలలు కన్నాను. చిత్రలేఖనం వంటి కళల్లోనూ ఆసక్తి ఉండేది. అయితే నటినవుతానని మాత్రం కలలో కూడా ఊహించలేదు. చదువు పూర్తి అయిన తరువాత ఆస్ట్రేలియాలో ఉద్యోగంలో చేరాను. ఆ సమయంలో అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ పోటీల్లో పాల్గొన్న ఇండియాకు చెందిన ఏకైక వ్యక్తిని నేనే. అలా తొలి ప్రయత్నంలోనే సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్‌ కిరీటాన్ని గెలుచుకున్నాను. ఆ తరువాత ఇండియాలో జరిగిన అందాల పోటీల్లో  మిస్‌ ఇండియా గ్లోబల్‌ కిరీటాన్ని గెలుచుకున్నాను. అలా అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకోవడంతో బాలీవుడ్‌లో సినీ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే అక్కడ ఆశించిన విధంగా ఆ అవకాశాలు లేకపోవడంతో నిరాకరించాను. అలాంటి సమయంలో తెలుగులో నాటకం అనే చిత్రంలో నటించే అవకాశం రావడంతో కథానాయకిగా పయనం మొదలైంది. ఆ తరువాత జెస్సీ చిత్రంలో నటించాను. ఆ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఆపై కోలీవుడ్‌లో కొలైక్కారన్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో విజయ్‌ఆంటోనికి జంటగా నటించాను. నేను నటించిన మూడు చిత్రాలు హిట్‌ కావడం సంతోషంగా ఉంది.

కొలైక్కారన్‌ చిత్రంలో నటించిన అనుభవం?
కొలైక్కారన్‌ నా కేరీర్‌లో భారీ చిత్రం. అందులో కథానాయకిగా నా పాత్ర పరిధి తక్కువే అయినా విజయ్‌ఆంటోని, అర్జున్, సీత వంటి  ప్రముఖ నటీనటులతో నటించడం మంచి అనుభవం. వారి సినిమా అనుభవం నాకు ఉపకరించిందనే చెప్పాలి.

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు?
రాజ భీమ చిత్రంలో ఆరవ్‌కు జంటగా నటిస్తున్నాను. ఇది మనిషికీ మృగాలకు మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుంది. ఇందులో ఏనుగు ప్రముఖ పాత్రలో కనిపిస్తుంది. ఏనుగుతో నటించడం సవాల్‌గా అనిపించింది. జంతువుల టైమింగ్‌కు తగ్గట్టుగా నటించడం చాలా కష్టం అనిపించింది.

సినిమాల్లో మీరు ఎవరిని పోటీగా భావిస్తున్నారు?
పోటీ లేని వృత్తే లేదు. అసలు పోటీ లేకుంటే శ్రమ తగ్గిపోతుంది. ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి. పోటీ తత్వం లేకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్లు అనిపిస్తుంది.

మీకు  నచ్చిన నటుడు?
నేను నటుడు విజయ్‌కు వీరా భిమానిని. ఆయన నటించిన తెరి, మెర్శల్, సర్కార్‌  చిత్రాల ను చూశాను. విజయ్‌ వంటి మాస్‌ హీరోకు జంటగా నటిం చాలన్న ఆశ  నా లాంటి హీరో యన్లకు ఎందుకు ఉండదు.

సరే ఇష్టమైన నటి?
సావిత్రి అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు మాత్రం నటి నయనతార అంటే చాలా ఇష్టం.

తమిళ సినిమా గురించి?
ఇతర భాషా చిత్రాలతో పోల్చి చూస్తే తమిళ చిత్రాల స్థాయి వేరే లెవల్‌లో ఉండ డం చూడగలుగుతున్నాం

ఎలాంటి పాత్రలో నటిం చాలని ఆశ పడుతున్నారు?
సినిమాల్లోకి వచ్చిన తరువాత పలాన పాత్రలే చేయాలని చెప్పకూడదు. ఒక నటిగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించడానికి నేను రెడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement