సినిమా కలెక్షన్స్‌కు గొడ్డలిపెట్టుగా మారిన పైరసీని అరికట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక రూపంలో పైరసీ జరుగుతూనే ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వివిధ వెబ్‌సైట్లలో మూవీ ప్రత్యక్షమవుతోంది. తాజాగా ధనుష్ రాయన్ సినిమాను కూడా ఇలాగే పైరసీ చేసేందుకు ప్రయత్నించాడో వ్యక్తి.
వెబ్‌సైట్‌లో ఫ్రీగా..
మధురైకి చెందిన స్టీఫెన్ రాజ్ కేరళలోని తిరువంతపురం థియేటర్‌లో తన సెల్‌ఫోన్‌లో రాయన్ సినిమాను రికార్డు చేసి తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇటీవలే వచ్చిన గురువాయురప్పన్ అంబలనడై సినిమాను సైతం థియేటర్లో రిలీజైన తర్వాతి రోజే వెబ్‌సైట్‌లో ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాడు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్మిన్ అరెస్ట్
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు స్టీఫెన్‌ను అరెస్ట్ చేశారు. మహారాజ, కల్కి 2898 ఏడీ చిత్రాల కాపీలు సైతం అతడి దగ్గర ఉన్నట్లు గుర్తించారు. తమిళ్‌రాకర్స్ అడ్మిన్‌గా పని చేస్తున్న ఇతడు.. థియేటర్‌లో కూర్చున్నప్పుడు కాఫీ కప్ పెట్టుకునే హోల్డర్‌లో మొబైల్ ఫోన్ పెట్టి సినిమాను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో
Comments
Please login to add a commentAdd a comment