ప్రభాస్‌ స్థాయి వేరు.. నీలాంటి వారిని పట్టించుకోరు: సుధీర్ బాబు | Tollywood Hero Sudheer Babu Reacts On bollywood Actor Comments On Prabhas | Sakshi
Sakshi News home page

Sudheer Babu: 'నీలాంటి వారిని ప్రభాస్‌ పట్టించుకోరు'.. సుధీర్ బాబు పోస్ట్ వైరల్

Published Tue, Aug 20 2024 7:04 PM | Last Updated on Tue, Aug 20 2024 8:16 PM

Tollywood Hero Sudheer Babu Reacts On bollywood Actor Comments On Prabhas

రెబల్ స్టార్‌ ప్రభాస్‌ కల్కి చిత్రంపై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా తనకు నచ్చలేదని అన్నారు. అంతేకాదు కల్కిలో ప్రభాస్ లుక్‌ జోకర్‌లా అనిపించిందని కించపరిచేలా మాట్లాడారు. దీంతో అర్షద్‌ వార్సీ చేసిన కామెంట్స్‌ వివాదానికి దారితీశాయి. ప్రభాస్‌ను ఉద్దేశించిన అతను చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు అర్షద్ వార్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.

తాజాగా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సైతం అర్షద్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ విషయంలో మీరు నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు.. కానీ అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్‌ నీలాంటి వారి నుంచి వస్తాయని ఊహించలేదని అన్నారు. ఇలా సంకుచిత మైండ్‌సెట్‌తో ఆలోచించే నీలాంటి వారిని ఆయన పట్టించుకోరని తెలిపారు. ఎందుకంటే ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని సుధీర్‌ బాబు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా..అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement