గత కొన్నిరోజుల నుంచి తెలుగు ప్రేక్షకుల మధ్య వినిపిస్తున్న పేరు 'కల్కి'. రిలీజ్ ముందు వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓవరాల్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలా అని పొరపాట్లు ఏం లేవా అంటే సినిమాలో చాలానే ఉన్నాయి. అయినా సరే మూవీ బాగానే ఉండటంతో జనాలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పొరపాట్ల విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
చాలామంది దర్శకులకు ఒకటి రెండు హిట్స్ పడగానే పొగరు తలకెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాము తీసిందే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. సినిమాలో పొరపాట్లు గురించి చెబితే తట్టకోలేరు. కానీ ఈ విషయంలో నాగ్ అశ్విన్‌ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తాజాగా 'కల్కి' సెట్‌లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు.
(ఇదీ చదవండి: కల్కిలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ అలా అనేశాడేంటి?)
'కల్కి'లో మేజర్ కంప్లైంట్స్ విషయానికొస్తే ఫస్టాప్ ల్యాగ్ అయిపోయింది. అయితే సినిమాని రెండు పార్ట్స్‌గా తీయాలనే ఉద్దేశంతో పాటు కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నామని నాగ్ అశ‍్విన్ చెప్పాడు. అలానే ఫస్టాప్ సీన్స్ కంటే ఎడిటింగ్‌ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చేసుండాల్సిందని చెప్పుకొచ్చాడు. ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుతూ.. కొన్నిచోట్ల ఎక్స్‌ట్రార్డీనరీగా వస్తే, కొన్నిచోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని, అక్కడ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని నాగ్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డాడు.
'మహానటి'లానే ఇందులోనూ నటీనటులతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. చివరి నిమిషంలో తొందర వల్ల బహుశా సరైన ఫినిషింగ్ రాలేదేమో! పట్టి పట్టి చెప్పినట్లు ఉందని తమకు కూడా అనిపించిందని నాగ్ అశ్విన్ అన్నాడు. యాక్ట్ చేసినవాళ్లు డబ్బింగ్ చెబితే 100 శాతం ఫెర్ఫెక్ట్ ఉంటుందనేది తన అభిప్రాయమని అందుకే ఇలా చేసినట్లు చెప్పాడు. పైన చెప్పిన వాటి బట్టి చూస్తే నాగ్ అశ్విన్ తాను చేసిన పొరపాట్లు ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టి వీటిని పార్ట్-2లో రిపీట్ కాకుండా చూస్తాడనే ఆశిద్దాం.
(ఇదీ చదవండి: ఆ కల్ట్ క్లాసిక్ చిత్రమే కల్కికి స్ఫూర్తినిచ్చింది: నాగ్ అశ్విన్)
Comments
Please login to add a commentAdd a comment