ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, వీకెండ్‌లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే అనేక రికార్డ్స్‌ను కల్కి క్రియేట్ చేస్తుంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని తెరకెక్కించారు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కల్కి మూవీలో నటించి మెప్పించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డ్స్‌ను దాటేసింది. ఒక వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఉంది. షారుక్‌ఖాన్- అట్లీ 'జవాన్' (రూ.520 కోట్లు) పేరుతో ఉన్న రికార్డు ప్రభాస్ దెబ్బకు బద్దలైంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారత్ చిత్రంగా హనుమాన్ (రూ.350 కోట్లు) ఉంది.
అయితే, ఆ రికార్డ్‌ను కల్కి కేవలం రెండు రోజుల్లోనే బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ టాప్-3 చిత్రాల జాబితాలో 'కల్కి' మూడో స్థానంలో ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ (రూ.223 కోట్లు), బాహుబలి2 (రూ.217 కోట్లు), కల్కి (రూ.191.5కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో రెండు ప్రభాస్ సినిమాలే ఉండటం విశేషం.
బాలీవుడ్‌లో పెరుగుతున్న కలెక్షన్స్
కల్కి సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలీవుడ్‌లో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. వీకెండ్ తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద భారీగానే రాబట్టింది. సోమవారం నాడు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్‌ను కల్కి రాబట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో రూ. 170 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. బాలీవుడ్ బయర్ల నుంచి కల్కి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో కల్కి సులభంగానే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment