
కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని కీర్తించారు. మరో ప్రపంచానికి వెళ్లొచ్చినట్లు ఉందన్నారు. అంత అద్భుతంగా ఉండబట్టే బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1200 కోట్లు రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం (ఆగస్టు 22) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.
సెటైర్లు
ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదులే అని ఫ్యాన్స్ ఏదో సర్దిపెట్టుకుందామనుకునేలోపే భైరవగా ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని సెటైర్లు వేశాడు. ఊహించినంత ఏమీ లేదని విమర్శలు గుప్పించాడు. ఈయన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా అర్షద్ వార్సీ కామెంట్లపై విరుచుకుపడ్డాడు.
అంత ఈజీ కాదు
అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కొన్ని సినిమాలను ఇష్టపడతాం. కొన్నింటిని లైట్ తీసుకుంటా. నటీనటుల విషయంలోనూ అంతే.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ మన అభిప్రాయాలను బయటకు ఎలా చెప్తున్నామనేది ముఖ్యం. సినిమా రంగంలోకి రావడం, ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. సద్విమర్శ మంచిదే కానీ.. జోకర్ వంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు.
ఒకే ఇండస్ట్రీలో ఉండి..
సినిమా రంగంలోనే ఉండి ఇలాంటి కామెంట్లు చేస్తారా? కల్కి.. భారతీయ సినిమాకే గర్వకారణంలాంటిది. నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతం రూ.1000 కోట్ల పైనే వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాలోని పెద్ద స్టార్స్‌లో ప్రభాస్ అన్న ఒకరు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. మన హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కంటే ప్రభాస్ అన్న ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్సే ఎక్కువ!
అలాంటి స్టార్‌డమ్
జయాపజయాలతో సంబంధం లేని స్టార్‌డమ్ తనది. కల్కి సక్సెస్ వెనక స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడ్డాడు. ఇదే నిజం. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నామనేది ఆలోచించుకుని మాట్లాడండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అని సిద్ధు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
#SiddhuJonnalagadda slams the comments made by #ArshadWarsi on Rebel Star #Prabhas.#NagAshwin #Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/lBdNhJNvDJ
— NANI (@NANI_09_30) August 21, 2024