డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. అలానే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రతిరోజూ మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఎక్స్‌పీరియెన్స్ చేస్తే బెటర్. కానీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కూడా కొందరున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బాలయ్య సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హాట్ బ్యూటీ)
'కల్కి' రిలీజ్ ముందు వరకు కాస్తోకూస్తో సందేహాలు ఉండేవి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫస్టాప్ కాస్త ల్యాగ్ అన్నారు. కానీ ఓవరాల్‌గా మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని రెండు సంస్థ దక్కించుకున్నాయి. దక్షిణాది భాషలకు సంబంధించిన హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ రైట్స్ మాత్రం నెట్‌ఫ‍్లిక్స్ సొంతం చేసుకుంది.
రిలీజ్‌కి ముందే 7-8 వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేలా కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని టాక్. ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి 'కల్కి' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. చాలావరకు ఇది నిజమయ్యే ఛాన్సులే ఉన్నాయి. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి అప్పుడు రిలీజైతే ఎక్కువమంది చూడటానికి అవకాశముంటుంది. కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ తేదీకే మొగ్గు చూపే అవకాశముంది. కొన్నిరోజులు ఆగితే ఏదో ఓ క్లారిటీ వచ్చేస్తుందిలే!
(ఇదీ చదవండి: 'కార్తీకదీపం' వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment