కల్కి మూవీ సక్సెస్‌.. పార్టీ చేసుకున్న జగపతిబాబు! | Tollywood Actor Jagapathi Babu Latest Video On Kalki Team Goes Viral | Sakshi
Sakshi News home page

Jagapathi Babu: కల్కి మూవీ సక్సెస్‌.. చీర్స్‌ అంటూ జగపతిబాబు సెలబ్రేషన్స్!

Published Sun, Jul 21 2024 3:15 PM | Last Updated on Sun, Jul 21 2024 3:51 PM

Tollywood Actor Jagapathi Babu Latest Video On Kalki Team Goes Viral

టాలీవుడ్ నటుడు జగపతి బాబు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. సలార్‌లో రాజమన్నార్‌గా తనదైన నటనతో మెప్పించారు. ఈ ఏడాది గుంటూరు కారంతో అలరించిన జగ్గుభాయ్.. ప్రస్తుతం పుష్ప-2, కంగువా లాంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా.. విదేశాల్లో, షూటింగ్స్‌లో ఏక్కడ ఉన్నా తన అనుభవాలను పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్‌ కలుపుతూ కనిపించారు. ప్రభాస్‌, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement