ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడినట్లు నాగ్ అశ్విన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం.
నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం(నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్) కలిసి మా తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం" ప్రారంభించాం . అప్పట్లో వైజయంతి నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకున్నది . నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఒక రోజు వర్షం కురిసింది. దీంతో షూటింగ్ పూర్తి చేయలేకపోయాం. దీంతో మళ్లీ షూటింగ్ సెట్ వేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ ఖర్చు ఎక్కువైంది. అది కాస్తా మమ్మల్ని భయాందోళనకు గురిచేసిందని. ' రాసుకొచ్చారు.
'అంతే కాకుండా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తున్నా. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment