
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిని ట్రాప్ చేసి వ్యభిచారం కూపంలో దింపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మార్చి 18న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన టీవీనటి (30)ని హైదరబాద్‌లో ఉండే ఆమె స్నేహితురాలు ఆహ్వానించింది. ఇక్కడ ప్రముఖ షాప్ ప్రారంభోత్సవంలో అతిథిగా రావాలని పిలుపునిచ్చింది. అందుకు గాను విమానఛార్జీలతో పాటు తగిన రెమ్యునరేషన ఇస్తారని చెప్పింది. దీంతో ఆ నటి హైదరాబాద్‌కు వచ్చేసింది. ఆమెకు మాసబ్‌ట్యాంక్ వద్ద ఉన్న శ్యామ్‌నగర్ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో బస ఏర్పాటు చేశారు. ఆమెకు అవసరం అయ్యే పనులు చేసేందుకు ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశారు.
ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ, 21న రాత్రి 9 గంటల సమయంలో నటి ఉన్న గదిలోకి వెళ్లి తమతో పాటుగా వ్యభిచారం చేయాలని, ఇద్దరు కస్టమర్స్ ఉన్నారంటూ బలవంతం చేశారు. ఆమె నో చెప్పడంతో రెండు గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమె గదిలోకి ఎంట్రీ ఇచ్చి తమతో గడపాలని బెదిరింపులకు దిగారు. ఆమె కేకలు వేయడంతో దాడి చేసి వారు పారిపోయారు. ఇంతలో వృద్ధురాలు, ఇద్దరు మహిళలు నటి గదిలోకి ప్రవేశించి ఆమెను బంధించి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదుతో పారిపోయారు. ఈ క్రమంలో తన స్నేహితురాలికి ఫోన్ చేసినా స్పందించలేదని ఆ నటి పేర్కొంది. దీంతో బాధితురాలు 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పడంతో వారు ఆమెను రక్షించారు. నటి ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment