Ram Gopal Varma Visits Puneeth Rajkumar's Memorial - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: పునీత్‌ లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, దేవుడిపై కోపం తెప్పిస్తుంది

Published Tue, Mar 29 2022 8:05 PM | Last Updated on Tue, Mar 29 2022 9:48 PM

Ram Gopal Varma Visits Puneeth Rajkumar Samadhi in Bangalore - Sakshi

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. తన తాజా చిత్రం ‘మా ఇష్టం’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆర్జీవీ ఈ సందర్భంగా పునీత్‌ సమాధిని దర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కిల్లింగ్‌ వీరప్పన్‌ మూవీ షూటింగ్‌ సమయంలో పునీత్‌ను పలుమార్లు కలిశానని చెప్పారు.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే, దక్షిణాది భాషలు మాత్రమే ఇక్కడ..

ఇక ఆయన చివరి చిత్రం జెమ్స్‌ విజయంపై వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా లేకపోయిన రీయల్‌ హీరోగా పునీత్‌ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆర్జీవ అన్నారు. అనంతరం వర్మ ట్వీట్‌ చేస్తూ మరోసారి పునీత్‌ మరణంపై గుర్తు చేసుకున్నారు. ‘పునీత్‌ రాజ్‌కుమార్‌ లాంటి గొప్ప వ్యక్తికి ఇలా జరగడమంటే దేవుడిపై నమ్మకం కొల్పోవడానికి ఇది మరో ఖచ్చితమైన కారణం అవుతుంది. నిజంగా కోపం తెప్పిస్తుంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement