కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణించిన నేటికి 11 రోజులు. ఆయన మృతిని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించారనే చేదు వార్తను విని తట్టుకోలేక కొంతమంది అభిమానుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేగాక రోజు ఆయన సమాధి వద్దకు వందల, వేల సంఖ్యల్లో తరలివస్తున్నారు. ఇంతమంది ప్రేక్షకుల అభిమాన్ని పునీత్ కేవలం హీరోగా మాత్రమే గెలుచుకోలేదు. ఆయన చేపట్టిన ఎన్నో సేవ కార్యక్రమాలతో, స్టార్ హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా అందిరితో కలిసిపోవడం, తన కోసం వచ్చిన ప్రతి అభిమానిని పేరుపేరున కలిసి పలకరించే వ్యక్తిత్వంతో ఇలా పునీత్ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు.
చదవండి: Puneeth Rajkumar:పునీత్ ఔదార్యాన్ని చూడలేక విధికి కన్నుకుట్టింది
ఇక ఆయన మరణాంతరం పునీత్ సేవాకార్యక్రమాలకు సంబంధించిన వార్తలు వస్తుండటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పించారు. ఆఖరికి మరణాంతరం తన రెడు కళ్లు కూడా దానం చేశారు. వీటితో పాటు మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన పునీత్ హఠాత్తుగా లోకాన్ని విడిచి వెల్లడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. అంతేగాక తాను ఉన్న లేకపోయిన తను చేపట్టిన సేవ కార్యక్రమాలు ఎప్పటిలాగే కొనసాగాలని పునీత్ వాటి పేరుతో 8 కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారట.
చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు!
ఈ విషయం తెలిసి ఎంతో మంది ఆయన గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సమక్షంలో అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్ కుమార్‌కు మరణానంతరం లభించింది. అత్యున్నత సేవలు చేసిన వారిని కర్ణాటక ప్రభుత్వం బసవ శ్రీ పురస్కారం అందించనుంది. ఇది కేవలం కన్నడిగులకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ అత్యుత్తమ పురస్కారం పునీత్ రాజ్‌కుమార్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. అలాగే ఆయన చేపట్టిన ఎనలేని సేవా కార్యక్రమాల దృష్ట్యా పునీత్ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.
చదవండి: హృదయ విదారకం: పునీత్ లేడని వాటికెలా చెప్పేది.. సమాధి వద్దకు తీసుకెళ్లి
A man with golden heart 💓
— Gani Thor (@gani_thor) October 29, 2021
45 Free Schools
26 Orphanages
16 Old age homes
19 Goshala lu
1800 Students Education
2 Eyes were Donated
Finally 1 Man
He is #PuneethRajkumar ❣️🙏
Miss u so much sir 😞#PuneetRajkumar @PuneethRajkumar pic.twitter.com/GT3gFhYUEJ
Comments
Please login to add a commentAdd a comment