Suriya Tears at the Memorial of Power Star Puneeth Rajkumar - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో

Published Fri, Nov 5 2021 2:04 PM | Last Updated on Fri, Nov 5 2021 4:14 PM

Surya Visits Puneeth Rajkumar Tomb And Pay Tribute - Sakshi

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గత శుక్రవారం(అక్టోబర్‌ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భారత సినీ, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు అగ్ర హీరోలంతా పాల్గొన్నారు. అయితే తమిళ పరిశ్రమ నుంచి ఒక్క శరత్‌ కుమార్‌ మాత్రమే ఆయన అంత్యక్రియలకు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నేడు పునీత్‌ సమాధిని హీరో సూర్య సందర్శించారు. అనంతరం ఆయన కటుంబ సభ్యులను పరామర్శించారు.

చదవండి: పునీత్‌ ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌, ఇవే అప్పు చివరి క్షణాలు!

కాగా పునీత్‌ సమాధి దగ్గర ఆయనకు నివాళులు అర్పించిన సూర్య. కన్నీటీ పర్యంతరం అయ్యారు. పునీత్‌ ఇక మన మధ్యలేరనే చేదు నిజాన్ని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాయల్‌ దేవ్‌రాజ్‌ అనే నటుడు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అయితే ఆయన అంత్యక్రియలకు రాలేని నటీనటులంతా ఆ తర్వాత స్వయంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున్‌, మెగా హీరో రామ్‌ చరణ్‌లతో పాటు పలువురు నటులు బెంగళూరులోని ఆయన నివాసానికి వచ్చి  పునీత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. ఇక పలు కారణాల చేత అంత్యక్రియలకు రాలేకపోయిన సూర్య కూడా శుక్రవారం వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. 

చదవండి: Puneeth Rajkumar: పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement