
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 20న) ఉదయం రేవనాథ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కాగా రేవనాథ్ గతంలో ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు. అల్లుడు పునీత్ లాగే రేవనాథ్ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు. ఇప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న అశ్వినికి తండ్రి రేవనాథ్ మరణం తీరని లోటనే చెప్పాలి!
Comments
Please login to add a commentAdd a comment