రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడ వెర్షన్‌లో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 15న తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత హిందీలోనూ రిలీజై నార్త్ ఆడిన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా కథకి, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
విడుదలైన అన్ని భాషల్లో కాంతార వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు ‘కాంతార’ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోగా ముందు అనుకుంది తనని కాదని, ఓ కన్నడ స్టార్ హీరోనంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపాడు రిషబ్ శెట్టి. ఇటీవల బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన రిషబ్ ఈ మూవీ విశేషాలను పంచుకున్నాడు.
చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో
ఈ సందర్భంగా కాంతార స్క్రిప్ట్ మొదట కన్నడ సూపర్ స్టార్, దివంగత నటులు పునీత్ రాజ్‌కుమార్ కోసం రాశానని చెప్పాడు. ‘పునీత్ రాజ్‌కుమార్ సార్ కోసమే కాంతార కథ రాశాను. స్క్రిప్ట్ అంత పూర్తయ్యాక వెళ్లి ఆయనను కలిసి స్క్రిప్ట్ చెప్పాను. అయితే ఆయన అప్పటికే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారు. అయితే ఈ కథ రియాలిటీగా రావాలంటే మీరు నటిస్తేనే బాగుంటుందని, ఇందులో మీరే చేయాలంటూ పునీత్ రాజ్‌కుమార్ సారు సలహా ఇచ్చారు. నన్నే హీరోగా చేయమన్నారు. ఇక ఆయన ఈ సినిమా చేయనన్నారు కాబట్టి. ఇక నేను చేశాను’ అంటూ రిషబ్ శెట్టి అసలు విషయం చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment