
దివంగత నటుడు, కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'అప్పు' అంటూ ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడు పునీత్ రాజ్ కుమార్. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ హఠాన్మరణం యావత్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పు మరణవార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే పునీత్ చనిపోవడం కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన చివరిసారిగా నటించిన చిత్రం 'జేమ్స్'. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.
చదవండి: జేమ్స్ సినిమా చూడలేను: పునీత్ భార్య అశ్విని భావోద్వేగం
పునీత్ జయంతి (మార్చి 17) సందర్భంగా జెమ్స్ మూవీ విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అప్పు ఫ్యాన్స్ థియేటర్లకు పొటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. మార్చి 25వరకు కర్ణాటక అన్ని థియేటర్లో జెమ్స్ మూవీ మాత్రమే ప్రదర్శించారు. అప్పును చివరి సారిగా తెరపై చూసి కన్నీటి పర్యంతం అయ్యారు పునీత్ అభిమానలు. ఆయన్నుతలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా 'జేమ్స్' మూవీ ఓటీటీ విడుదల తేది ఖరారైంది. ఏప్రిల్ 14 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు మరింత చేరువకానుంది.
చదవండి: 'జేమ్స్' మూవీ ఎలా ఉందంటే...
Comments
Please login to add a commentAdd a comment