Jr NTR Emotional About Late Puneeth Rajkumar During RRR Promotions in Bengaluru - Sakshi
Sakshi News home page

Jr NTR: ఆయన లేకపోతే అంతా జీరోలా అనిపిస్తోందంటూ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌

Published Fri, Dec 10 2021 6:21 PM | Last Updated on Fri, Dec 10 2021 6:58 PM

Jr NTR Emotional About Late Puneeth Rajkumar - Sakshi

Jr NTR Singing Geleya Geleya in RRR Press Meet for Late Puneeth Rajkumar: అందరివాడుగా పేరు తెచ్చుకున్న పునీత్‌ రాజ్‌కుమార్‌కు తెలుగునాట కూడా మంచి క్రేజ్‌ ఉంది. తెలుగు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తోనూ అతడికి సన్నిహిత సంబంధం ఉంది. పునీత్‌ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం తారక్‌ ఓ పాట కూడా పాడాడు. 'గెలయా గెలయా..; అంటూ సాగే ఈ పాట సూపర్‌ డూపర్‌ హిట్టైంది. తాజాగా ఈ పాటను ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో పాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు ఎన్టీఆర్‌.

శుక్రవారం నాడు బెంగళూరులో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో పాటు రాజమౌళి, అలియా భట్‌, రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు, కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు ఎన్టీఆర్‌. ఆయన లేని కర్ణాటక జీరోగా కనిపిస్తుందన్నాడు. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీర్వాదాలు మాత్రం తనకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నాడు. అప్పు నటించిన సినిమాలోని గెలయా గెలయా.. సాంగ్‌ను పాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన గౌరవార్థం ఈ పాట ఇదే చివరిసారిగా పాడుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement