Puneeth Rajkumar Naatu Naatu Song Edited Dance Video, Viral On Social Media - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar-RRR Movie: పునీత్‌ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్‌, వీడియో వైరల్‌

Published Mon, Nov 22 2021 7:46 PM | Last Updated on Tue, Nov 23 2021 10:22 AM

Puneeth Rajkumar Steps To RRR Movie Naatu Naatu Kannada Version Song - Sakshi

ధర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ మ్యానియా దేశం మొత్తం వ్యాపించింది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్‌ ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల నవంబర్‌ 10న విడుదలై ఈ పాట 3 కోట్ల వీక్షణలకు చేరువైంది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాస్‌ సెప్పులు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంఉన్నాయి.

చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి

దీంతో ఆ పాట స్పూఫ్‌ చేస్తూ పలువురు సోషల్‌ మీడియాలో వీడియోలు వదలుతున్నారు. టీవీలో వస్తున్న ఈ పాటకు ఓ బామ్మ స్టెప్పులేసిన వీడియో నెట్టింట తెగ వైరలైంది. ఇక ఈ పాటను పెద్ద తెరపై వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించ‌గా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు.

చదవండి: ఆసక్తికర ఫొటో, క్యాప్షన్‌తో జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అప్‌డేట్‌

దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత కవర్‌ సాంగ్స్‌తో, ఎడిటర్స్‌ తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో ‘నాటు’ను రీక్రియేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ఈ క్ర‌మంలో పునీత్ రాజ్ కుమార్ డ్యాన్స్‌ స్టెప్పులకు నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్‌ను రూపొందించారు. ఈ వీడియోకి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ వీడియోకి స్పందించ‌డం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement