Puneeth Rajkumar Wildlife Show Gandhada Gudi Teaser Out: కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి టీజర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ రోజు(డిసెంబర్ 6) పునీత్ తల్లి పార్వత్మ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఆయన ఎంతో ఇష్టంగా చేసిన గంధడ గుడి పేరుతో ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. పునీత్ ప్రకృతి ప్రేమికుడనే విషయం తెలిసిందే. అందుకే అయన ఏరికోరి ఈ డాక్యుమెంటరీని చేశారట. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిని ఈ రియాలిటీ లైవ్ షోలో సుందరమైన బీచ్‌లు, నదుల అందాలను.. ప్రకృతిలోని ప్రపంచాన్ని అన్వేషిస్తుంది.
చదవండి: అభిమానులకు పుష్ప టీం షాక్, ట్రైలర్ వాయిదా, కారణమిదే!
కర్నాటక అడవుల్లో పరిరక్షణ కోసం సుప్రసిద్ధ వన్యప్రాణి చిత్ర నిర్మాత అమోఘవర్ష జెఎస్‌తో పునీత్ జతకట్టారు. పునీత్ చేసిన ఈ డాక్యుమెంటరీ చాలా కాలంగా రూపొందుతోంది. ఈ డాక్యుమెంటరీకి గంధడ గుడి అనే పేరు పెట్టారు. గంధడ గుడి అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం. కాగా గతంలో గంధడ గుడి టైటిల్‌తో అప్పు తండ్రి దివంగత లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్ సినిమా కూడా చేశారు. 1973లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో పునీత్ అదే పేరుతో ఈ ప్రకృతి డ్యాక్యుమెంటరిని తీశారు. తన సొంత రాష్ట్రం కర్ణాటక గురించి రాష్ట్రంలోని అందాల గురించి ఇతర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పు ఎన్నో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టారు.
చదవండి: సమంత మరో పాన్ ఇండియా చిత్రం టైటిల్ ఇదే, డైరెక్టర్లు ఎవరంటే..
అందులో ఈ ‘గంధడ గుడి’ వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి ఒకటి. వచ్చే ఏడాది థియేటర్లో అప్పు వైల్డ్‌లైఫ్ షో విడుదల కానుంది. ఇక గంధడ గుడి డాక్యుమెంటరీ కర్ణాటకలోని అరణ్యాల పవిత్రతను, సంపదను రక్షించడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తోంది. ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత అమోఘవర్ష ‘అప్పు కల ఒక అద్భుతమైన ప్రయాణం, మా భూమి విశిష్టత గురించి తెలియజేసే ఒక పురాణం.. గంధడ గుడి’ అంటూ ట్వీట్ చేశారు. 2019లో అమోఘవర్ష రూపొందించిన వైల్డ్ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పుడు ఈ వైల్డ్ డాక్యుమెంటరీని తోటి వన్యప్రాణి చిత్ర నిర్మాత కళ్యాణ్ వర్మతో కలిసి అమోఘవర్ష రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment