Wildlife and Forests
-
వన విహారం చేద్దాం రండి
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం... ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చికబయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ ఓపెన్ జిప్సీల్లో పర్యటిస్తూ ఉంటే ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని అటవీశాఖ పర్యాటకులకు కల్పించింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తుమ్మలబైలు సమీప ప్రాంతం నుంచి ‘జంగిల్ సఫారీ’ పేరుతో అటవీ ప్రాంత సందర్శనకు ఏర్పాట్లు చేసింది. వివిధ ప్యాకేజీలతో పర్యాటకులు సురక్షితంగా అటవీ ప్రాంతాన్ని చుట్టి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది.విభిన్న ప్యాకేజీలతో టైగర్ సఫారీ..పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలో మీటరు వద్ద ఉన్న గోర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి ఓపెన్ జిప్సీల్లో ‘టైగర్ సఫారీ’ ప్రయాణం మొదలవుతుంది. మొదటి ప్యాకేజీగా రాను, పోనూ కలిపి 26 కిలోమీటర్ల మేర ప్రయాణం ఉంటుంది. దీని ధర రూ.2,400. (ఆరుగురు) లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూ పాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా సాగే ఈ ప్రయాణం తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో ముగుస్తుంది. రెండవ ప్యాకేజీ ధర రూ.4 వేలు(ఆరుగురు). ఈ ప్యాకేజీలో 40 కిలోమీటర్ల మేర నల్లమలలో ప్రయాణం ఉంటుంది. నల్లమలలోని పెద్దారుట్ల గేట్, పెద్దారుట్ల వాచ్ టవర్, బేస్ క్యాంపు, పుల్లలదొన, గుడిమెట్ల, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణం ఉంటుంది.కనువిందు చేస్తున్న వన్యప్రాణులు జంగిల్ సఫారీలో భాగంగా నల్లమలలో జిప్సీ వాహనంలో పర్యటిస్తున్న సందర్శకులకు రాజసానికి ప్రతీకగా నిలిచే పెద్దపులులు కనువిందు చేస్తుంటాయి. పులిచెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న పెద్దపులులు, చిరుతలు, కృష్ణజింకలు, దుప్పులు, నెమళ్లు తారసపడుతుండటంతో పర్యాటకులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నారు. అదేవిధంగా జంగిల్ సఫారీ ప్రారంభమయ్యే గోర్లెస్ కాలువ ప్రాంతం వద్ద ఏర్పాటుచేసిన పర్యావరణ విజ్ఞాన కేంద్రం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ కేంద్రంలో పెద్దపులి, జింకలు, కృష్ణజింక, నీల్గాయ్, సాంబార్, హనీబ్యాడ్జర్, మూషిక జింకలు, రెడ్ జంగిల్ పౌల్, గ్రే జంగిల్ పౌల్, హార్న్‌బిల్ పక్షులు, గుడ్లగూబ, నెమలితోపాటు ఎన్నో రకాల పక్షుల అందమైన ఆకృతులను ప్రతిష్టించారు.దీంతోపాటు సరికొత్త టెక్నాలజీతో ఒక్కో వన్యప్రాణి బొమ్మ వద్ద నిలబడినప్పుడు ఆ వన్యప్రాణి అరుపులతోపాటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు లౌడ్ స్పీకర్లో వినబడేలా ఏర్పాట్లుచేశారు. వాహనాలు ప్రయాణించే దారి పొడవునా ఉండే వివిధ జాతుల వృక్షాలపై వాటి పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటుచేసి సందర్శకులకు అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సాగే ఈ జంగిల్ సఫారీని సుక్షితులైన అటవీ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో వాహనాలు మరమ్మతులకు గురైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి మరో వాహనాన్ని ఘటనాస్థలానికి పంపించేలా అధునాతన టెక్నాలజీతో కూడిన వాకీటాకీలను వినియోగిస్తున్నారు. -
పునీత్ రాజ్‌కుమార్ వైల్డ్‌లైఫ్ షో టీజర్ చూశారా?
Puneeth Rajkumar Wildlife Show Gandhada Gudi Teaser Out: కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి టీజర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ రోజు(డిసెంబర్ 6) పునీత్ తల్లి పార్వత్మ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఆయన ఎంతో ఇష్టంగా చేసిన గంధడ గుడి పేరుతో ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. పునీత్ ప్రకృతి ప్రేమికుడనే విషయం తెలిసిందే. అందుకే అయన ఏరికోరి ఈ డాక్యుమెంటరీని చేశారట. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిని ఈ రియాలిటీ లైవ్ షోలో సుందరమైన బీచ్‌లు, నదుల అందాలను.. ప్రకృతిలోని ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. చదవండి: అభిమానులకు పుష్ప టీం షాక్, ట్రైలర్ వాయిదా, కారణమిదే! కర్నాటక అడవుల్లో పరిరక్షణ కోసం సుప్రసిద్ధ వన్యప్రాణి చిత్ర నిర్మాత అమోఘవర్ష జెఎస్‌తో పునీత్ జతకట్టారు. పునీత్ చేసిన ఈ డాక్యుమెంటరీ చాలా కాలంగా రూపొందుతోంది. ఈ డాక్యుమెంటరీకి గంధడ గుడి అనే పేరు పెట్టారు. గంధడ గుడి అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం. కాగా గతంలో గంధడ గుడి టైటిల్‌తో అప్పు తండ్రి దివంగత లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్ సినిమా కూడా చేశారు. 1973లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో పునీత్ అదే పేరుతో ఈ ప్రకృతి డ్యాక్యుమెంటరిని తీశారు. తన సొంత రాష్ట్రం కర్ణాటక గురించి రాష్ట్రంలోని అందాల గురించి ఇతర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పు ఎన్నో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టారు. చదవండి: సమంత మరో పాన్ ఇండియా చిత్రం టైటిల్ ఇదే, డైరెక్టర్లు ఎవరంటే.. అందులో ఈ ‘గంధడ గుడి’ వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి ఒకటి. వచ్చే ఏడాది థియేటర్లో అప్పు వైల్డ్‌లైఫ్ షో విడుదల కానుంది. ఇక గంధడ గుడి డాక్యుమెంటరీ కర్ణాటకలోని అరణ్యాల పవిత్రతను, సంపదను రక్షించడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తోంది. ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత అమోఘవర్ష ‘అప్పు కల ఒక అద్భుతమైన ప్రయాణం, మా భూమి విశిష్టత గురించి తెలియజేసే ఒక పురాణం.. గంధడ గుడి’ అంటూ ట్వీట్ చేశారు. 2019లో అమోఘవర్ష రూపొందించిన వైల్డ్ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పుడు ఈ వైల్డ్ డాక్యుమెంటరీని తోటి వన్యప్రాణి చిత్ర నిర్మాత కళ్యాణ్ వర్మతో కలిసి అమోఘవర్ష రూపొందించారు. -
అభయారణ్యంలో అలుగుల వేట
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యంలో అరుదైన వన్యప్రాణులు అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. వీటి మూతి ముంగీసను పోలి ఉంటుంది. వీటి జీవితకాలం సుమారు 20 ఏళ్లు. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. వీటి చర్మంపై ఉండే పెంకులు (పొలుసులు) దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకూ సంచరిస్తున్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెప్పారు. అలుగులు రాత్రి సమయంలోనే ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. ఇవి సంచరిస్తున్న సమయంలో ఎటువంటి అలికిడి వచ్చినా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. వీటి వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును తేలి గట్టిగా ఉంటాయి. అలుగులపై వేటగాళ్ల కన్ను అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై వేటగాళ్ల కన్ను పడింది. అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలుగు పెంకులను చైనాలో మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారని చెప్తున్నారు. దీంతో అటవీప్రాంతంలో కూడా అలుగుల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు అలుగును పట్టుకుని రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్బుక్లో అలుగు వీడియోను అప్లోడ్ చేశారు. దీనిపై అధికారులు స్పందించి అలుగును అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అరుదైన వన్య ప్రాణులను పట్టుకుని విక్రయించాలని చూస్తే చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధిస్తారని వైల్డ్ లైఫ్ అధికారులు పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడితే శిక్షిస్తాం చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. ముఖ్యంగా పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం -
అడవికి అందమొచ్చింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగింపుతో వన్యప్రాణులు, జంతువులకు ఆటవిడుపుగా మారింది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రోడ్లపై అన్ని రకాల వాహనాల (అత్యవసర అవసరాలకు మినహాయించి) రాకపోకలు, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేకపోవడంతో వివిధ రకాల జంతువులు స్వేచ్ఛగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపైకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పలుచోట్ల పగటిపూటే చిరుత పులులు రోడ్లపైనా కనిపించినట్టు అటవీశాఖ అధికారులకు నివేదికలు అందాయి. ఇటీవల ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గుండం రోడ్డుకు సమీపంలో చిరుతలు దర్శనమిచ్చాయి. ఎప్పుడూ అడవుల్లోనే ఉంటూ బయటకు అంతగా కనిపించని పునుగుపిల్లులు ఈ మధ్యే బాన్సువాడ సమీప గ్రామాల్లోకి వచ్చాయి. ఇవి ఎక్కువగా చిత్తూరు అడవుల్లో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతలు మనుషులు బందీ.. స్వేచ్ఛగా వన్యప్రాణులు.. లాక్డౌన్ పుణ్యమా అని ఒక్కసారిగా మనుషులు ఇళ్లలోనే బందీ అయ్యారు. ఇందు కు పూర్తి భిన్నంగా వన్యప్రాణులు, జంతు వులు, పశు పక్ష్యాదు లు స్వేచ్ఛగా సంచ రిస్తూ తమ ఆనందాన్ని చాటుతున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రభావం పర్యావరణం, ప్రకృతిపై బాగా చూపుతోందనే అభిప్రాయాన్ని పర్యా వరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వివిధ అటవీ ప్రాంతా ల సమీపంలోని రోడ్లు, జనావాసాలకు దగ్గరగా వివిధ రకాల జంతువులు దర్శనమిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు, ఏటూరునాగారం అటవీ ప్రాంతం సమీపంలోని కొన్ని చోట్ల పులులు కనిపించినట్టుగా అటవీ సిబ్బందితో పాటు స్థాని క ప్రజలు చెబుతున్నారు. చదవండి: చైనాపై పెరిగిన అనుమానాలు? సిద్దిపేట, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఆసిఫ్‌నగర్, కాగజ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం తదితర చోట్ల అటవీ ప్రాంతాలకు సమీపంలోని రోడ్లు దాటుతూ, ఆయా ప్రాంతాల్లోని నీటిగుంటలు, చెలమలు, అటవీ శాఖ ఏర్పాటు చేసిన సాసర్ పిట్ల వద్దకు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, నీల్గాయిలు, దుప్పులు, సాంబార్, నక్కలు, ఇతర జంతువులు వచ్చినట్టుగా కెమెరా ట్రాప్‌లలో తీసిన ఫొటోలతో స్థానిక అటవీ అధికారుల నుంచి హైదరాబాద్ అరణ్యభవన్‌లోని ఉన్నతాధికారులకు నివేదికలు అందాయి. బాన్సువాడ గ్రామంలోకి వచ్చిన పునుగు పిల్లి ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఏర్పడటంతో పులులతో పాటు అడవుల్లోపలే ఉండటానికి ఇష్టపడే ఇతర జంతువులు కూడా స్వేచ్ఛగా రోడ్లపైకి, వాటి సమీపంలోని నీటి గుంటలు, ఇతర ప్రాంతాల వద్దకు వస్తున్నట్టుగా వివిధ చోట్ల నుంచి అధికారులకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్), ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో పులుల కదలికలు గుర్తించి, వాటి సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ‘వెహికిల్ ట్రాఫిక్ నిలిచిపోవడంతో అడవులు, వాటి సమీపంలోని రోడ్లపై వన్యప్రాణులు, వివిధ జంతువుల సంచారం పెరిగింది. అక్కడక్కడ చిరుతలు కూడా తరచుగా కనిపిస్తున్నాయి. ఆమ్రాబాద్ పరిధిలో రోజుకు సగటున అయిదారు వందల వాహనాలు వెళ్లేవని, వీకెండ్స్‌లో వీటి సంఖ్య రెట్టింపయ్యేదని, ఇప్పుడవి పూర్తిగా నిలిచిపోవడంతో జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే మనుషులు వేసే పండ్లు, ఆహారానికి అలవాటు పడ్డ కోతులు, అవి లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ అడవుల్లోకి తరలుతున్నాయి. ఇక కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అడవుల్లోని చెంచులకు బియ్యం, ఇతర సరుకుల పంపిణీ చేసేందుకు కొందరు వస్తున్నారు. మేము ఎవరినీ అడవుల్లోకి అడుగుపెట్టనీయడం లేదు. మేమే చెంచులు, గిరిజనులకు సహాయ సామగ్రిని అందజేస్తున్నాం..’ – ‘సాక్షి’తో నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో జోజి వన్యప్రాణులకూ తగిన స్పేస్ ఇవ్వాలి.. ‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో అడవులు, జూలు, అభయారణ్యాలు, జాతీయపార్కుల్లోని జంతువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. లాక్డౌన్ కారణంగా అడవుల్లోంచి బయటకు వస్తున్న వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూస్తున్నాం. ప్రస్తుతం అడవుల్లోని రోడ్లపై, వాటికి సమీప జనావాసాలకు దగ్గరగా జంతువులు కనిపిస్తున్నట్టు ఫీల్డ్ స్టాఫ్ చెబుతున్నారు. పగలే చిరుతపులులు దర్శనమిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి జంతువులకు సహజంగా తగిన స్పేస్ (జాగా) ఇవ్వాలని స్పష్టమైంది. మానవ హక్కులకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తామో, స్వేచ్ఛగా సంచరించే విషయంలో జంతువులకున్న హక్కులను మనం గౌరవిస్తే మంచిది..’ – ‘సాక్షి’తో అటవీ శాఖ వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ -
అడవికి అందమొచ్చింది!
అన్యాక్రాంతమైన అటవీ భూములపై ఆ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అటవీ భూముల పునరుద్ధరణతోపాటు వన్యప్రాణులకు ఆవాసంగా మలిచేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషికి మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ఒకే చోట 15 అడవి దున్నలు చిక్కాయి. కిన్నెరసాని పరిధిలోని చాటకొండ అటవీ రేంజ్ చింతోనిచిలక వద్ద అడవి దున్నల మంద సేద తీరుతున్న దృశ్యాలు కెమెరాకు దొరికాయి. ఆక్రమణలకు గురైన 716 హెక్టార్ల అటవీ భూమిని ఐదేళ్ల కిందట అటవీ శాఖ తిరిగి తమ అధీనంలోకి పునరుద్ధరణకు పూనుకుంది. అంతేకాకుండా కంపాతోపాటు బయోశాట్ నిధులతో పునరుజ్జీవన చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతం మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో చుట్టూ కందకాలు తవ్వారు. చైన్ లింక్ ఫెన్సింగ్‌ను కూడా ఏర్పాటు చేసి మనుషులతోపాటు, పశు సంపద, పెంపుడు జంతువుల కదలికలు కూడా అటవీ ప్రాంతంలో లేకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడే బేస్ క్యాంపును ఏర్పాటు చేయటంతోపాటు నీటి వసతిని పరిరక్షించే చర్యలు చేపట్టారు. సోలార్ బోర్లను ఏర్పాటు చేసి శాకాహార జంతువుల కోసం సహజమైన గడ్డిమైదానాలు పెరిగేలా చూశారు. – సాక్షి, హైదరాబాద్ బెదిరింపులు వచ్చాయి... నిరంతర నిఘాతో పాటు, తరచుగా ఉన్నతాధికారులు అటవీ ప్రాంతంలో పర్యటించటం మంచి ఫలితాలను ఇచ్చిందని ఖమ్మం రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ రాజారావు తెలిపారు. సహజ అడవి, ఆవాస చర్యలు చేపట్టిన తర్వాత కూడా అనేక సార్లు ఆక్రమణదారులు దాడులు చేశారని, బేస్ క్యాంపు సిబ్బందిని బెదిరించటంతో పాటు, బోర్ వెల్స్‌ను ధ్వంసం చేసినట్టు చెప్పారు. అయినా పటిష్ట వ్యూహంతో అటవీ భూమిని కాపాడుతున్నట్టు కొత్తగూడెం జిల్లా అటవీ అధికారి రాంబాబు తెలిపారు. తాము ఐదేళ్లు పడిన శ్రమకు తాజాగా కనిపించిన భారీ అడవి దున్నల గుంపుతో తగిన గుర్తింపు వచ్చిందన్నారు. చుక్కల దుప్పి, జింకలు, అడవి పందులు, నీల్గాయి లాంటి ఇతర జంతువులు కూడా గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. చిరుత పులుల సంచారంపై సమాచారం ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. కిన్నెరసాని అటవీ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి పరుస్తామని, పర్యాటకుల కోసం ఎకో టూరిజం ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. కామారెడ్డి అడవుల్లో మరోవైపు కామారెడ్డి అటవీ ప్రాంతంలోనూ ఒకే చోట మూడు చిరుత పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. వేసవిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన నీటి వసతి దగ్గర ఇవి సేదతీరినట్టు వెల్లడి కావడంతో కొత్తగూడెం రేంజ్ అధికారులు, సిబ్బందిని అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఎండాకాలంలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఓవైపు అడవి అగ్నిప్రమాదాల బారిన పడకుండా చూడటం, మరోవైపు వన్యప్రాణులకు నీటి వసతిని ఏర్పాటు చేయటం, వేటగాళ్ల నియంత్రణ పకడ్బందీగా చేపట్టాలని పీసీసీఎఫ్ పీకేఝా ఆదేశించారు. -
ఎన్నికల చెక్‌పోస్టులున్నా ఆగని స్మగ్లింగ్
పోలీసుల కన్నుగప్పి సాగుతున్న అక్రమ రవాణా పౌడరు రూపంలోనూ తరలుతున్న ఎర్రచందనం సాక్షి, చిత్తూరు: ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా జిల్లాలో పోలీసు చెక్‌పోస్టులు విస్తృతంగా ఏర్పాటు చేసినా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను మాత్రం పోలీసులు, అటవీ శాఖాధికారులు అడ్డుకోలేకపోయారు. చిత్తూరు ఈస్టు ఫారెస్టు డివిజన్, తిరుపతి వైల్డ్‌లైఫ్ ఫారెస్టు డివిజన్ పరిధుల్లో ఫిబ్రవరి నుంచి పోలీసులు ఎక్కువగా ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యూరు. దీన్ని అవకాశంగా తీసుకున్న స్మగ్లర్లు ప్రధాన రహదారులపై ఉన్న పోలీసు చెక్‌పోస్టులను వదిలేసి గ్రామాల మీదు గా చెన్నై, తమిళనాడు, కర్ణాటకవైపు వెళ్లే విధంగా వ్యూహం మార్చుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా తిరుపతి అటవీప్రాంతం నుంచి ఐచర్ వాహనంలో తరలిస్తున్న రూ.10 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు పూతలపట్టు మండలంలోని రంగంపేట వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటలకు పట్టుబడ్డాయి. ద్విచక్రవాహనదారుడిని ఢీకొని పారిపోతున్న ఐచర్ వాహనాన్ని సుమో డ్రైవర్ గమనించి వెంటపడడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యూరు. తిరుచానూరులో గురువారం తెల్లవారుజామున ఐచర్ వాహనంలో 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న డ్రైవర్‌కు పోలీసు వాహనం కంటపడింది. వారినుంచి తప్పించుకునేందుకు ఆలయం వైపు వెళ్లాడు. చలువపందిళ్లను ఢీకొని వాహనం ఆగిపోయింది. డ్రైవర్ పరారయ్యాడు. పనపాకం ఫారెస్టు బీట్పరిధిలో కూడా వారం క్రితం ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు నిరంతరాయంగా తరలించేస్తున్న ఎర్రచందనం దుంగలు విలువ కోట్లలో ఉంటుంది. రూపుమార్చి తరలింపు నిన్నమొన్నటి వరకు బెరడుతీసిన పెద్దపెద్ద ఎర్రచందనం దుంగలను వివిధ రకాల వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తరహా స్మగ్లింగ్‌పై అధికారులు నిఘాపెట్టడం, దాడులు ఎక్కువచేస్తుండడంతో స్మగ్లర్లు స్మగ్లింగ్‌కు వీలుగా రహస్యప్రదేశాల్లోనే చిన్న, చిన్న దుంగలుగా కత్తిరించి లారీల కింద భాగంలో అమర్చి రవాణా చేయడం కూడా ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ స్మగ్లర్ ఎర్రచందనం పౌడరును బాక్స్‌ల్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తుండగా పట్టుకుని అరెస్టు చేశారు. దీన్నిబట్టి చూస్తే ఎర్రచందనాన్ని స్మగ్లర్లు దుంగల రూపంలోనే కాకుండా ఎర్రచందనాన్ని విదేశాలకు పౌడరు రూపంలో కూడా ఎగుమతి చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. సాయుధ దళాల తగ్గింపు ఎన్నికల విధులు ఉండటంతో రెండు నెలలుగా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను వేటాడేందుకు వేళ్లే సాయుధ పోలీసుదళాల సంఖ్యను తగ్గించారు. అటవీశాఖాధికారులు కూడా కొంత మేర శివారు ప్రాంతాల్లో నిఘా వేయటం మినహా, దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లటం మానుకున్నారు. దీంతో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు గ్రామాల మీదుగా యథేచ్ఛగా ఎర్రచందనం నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు.