
సాక్షి, బెంగళూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణించిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని రామ్‌చరణ్ అన్నారు. బుధవారం బెంగళూరు సదాశివనగర్‌లోని పునీత్ రాజ్‌కుమార్ నివాసంలో భార్య అశ్విని, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, పునీత్‌కు నివాళులర్పించారు. అనంతరం రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'పునీత్ మా కుటుంబ సభ్యుల్లో ఒకరు. పునీత్ మరణంతో తన సోదరుడిని కోల్పోయిన బాధ కలిగింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. దేవుడు అంత త్వరగా తీసుకెళ్లడం ఆవేదన కలిగిస్తోంది. ఆయనకు ఇలా జరిగిందన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మాటలు రావట్లేదు.
చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు)
పునీత్ చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉంది. పునీత్ మా ఇంటికొస్తే ఆయన ముందు మేము గెస్ట్‌లాగా పీలయ్యేలా చేస్తారు. గతంలో శివరాజ్‌కుమార్ కూతురు వివాహానికి ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి శివన్నతో కలిసి పునీత్ హైదరాబాద్‌లో మా ఇంటికి వచ్చారని ఈ సందర్భంగా రామ్‌చరణ్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి, సొసైటీకి చాలా చేశారు. వీ లవ్ యూ పునీత్, వీ మిస్ యూ పునీత్ అంటూ రామ్‌చరణ్ భావోద్వేగానికి గురయ్యారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యలకు, అభిమానులకు తగినంత శక్తినివ్వాలని రామ్‌చరణ్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment