Puneeth Rajkumar Death: Know the Puneeth Rajkumar and Ashwini Revanth Love Story - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌, అశ్విని రేవంత్‌ లవ్‌ స్టోరీ..వైరల్‌

Oct 29 2021 4:54 PM | Updated on Oct 29 2021 5:45 PM

Kannada power star Puneeth Rajkumar Ashwini Revanth love story - Sakshi

పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు.1999 డిసెంబర్ ఒకటిన పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం(అక్టోబర్ 29వ తేదీ) తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్‌కు  ప్రాధాన్యత ఇచ్చే తమ అభిమాన హీరో అప్పు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం అలు అభిమానులతో పాటు, పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసందర్భంగా జిమ్‌ వర్కవుట్స్‌ వీడియోలు, ఫోటోలను అభిమానులు   షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  అశ్వినీ  రేవంత్, పునీత్‌ రాజ్‌ కుమార్‌  లవ్‌ స్టోరీ వైరల్‌ అవుతోంది. (Puneeth Rajkumar: గొప్ప ఔదార్యంపై ఔరా అంటున్న ఫ్యాన్స్‌)


పునీత్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా అతని అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. పునీత్‌ ఆఅంత్యక్రియలు రేపు అంటే (అక్టోబర్, 30) జరగనున్నాయి. 1976లో బాలనటుడిగా కరియర్‌ ప్రారంభించిన పునీత్‌  ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు.

లవ్‌ స్టోరీ
పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. అలా కొనసాగిన వారి స్నేహం ఒకరిపై మరొకరికి ప్రేమను పెంచింది. ఎనిమిది నెలల స్నేహం తరువాత పునీత్‌ ఆమెకు ప్రపోజ్ చేయగా, ఆమె వెంటనే అంగీకరించింది. అయితే అన్ని ప్రేమ కథల్లాగానే వీరి స్టోరీలో కూడా అడ్డంకులూ, అభ్యంతరాలూ వచ్చాయి. కానీ ఒపిగ్గా పెద్ద వారిని ఒప్పంచి మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు. వీరి పెళ్లికి పునీత్ కుటుంబం సంతోషంగా ఒప్పుకున్నా,  అశ్విని కుటుంబం  అంగీకరించలేదు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు అశ్విని కుటుంబం ఆమోదం తెలిపింది.

చివరికి 1999న డిసెంబర్ ఒకటిన పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటూ ప్రశంసలందుకున్నారు. ఈ దంపతులకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  సజావుగా సాగిపోతున్న  వీరి 20 ఏళ్ల కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో, పునీత్‌ అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడటం విషాదం.

ఎవరీ అశ్విని రేవంత్‌
అశ్విని 1981లో కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం ఆమె శాండిల్‌వుడ్‌లో ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. అనేక సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కూడా పని చేశారు. 2019లో పునీత్‌ ప్రొడ్యూస్‌ చేసిన కవల్‌దారి మూవీని ప్రెజంటర్‌గా వ్యవహరించారు. అలాగే వీరిద్దరూ పీఆర్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మించారు. అలా 2016లో మాయాబజార్‌, తరువాత ఫ్రెంచ్‌ బిర్యానీ, 02 లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీలను తెరకెక్కించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబి నేషన్‌లో ఒక మూవీ ప్రీ-‍ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement