
కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల సిద్దమవుతోంది. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జేమ్స్ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్ మూవీలోని పునీత్ పోస్టర్‌ను షేర్ చేశాడు ప్రభాస్.
చదవండి: అల్లు అర్జున్‌కు అలాంటి అవాంతరాలు, జ్యోతిష్యులు ఏం చెప్పారంటే..
ఈ పోస్ట్‌లో ప్రభాస్ ‘‘మ్జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మార్చి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం విధితమే.