
పునీత్ నాకు లైఫిచ్చిన హీరో. నన్ను ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. 'భోళా శంకర్' సినిమా ప్రకటించినప్పుడు పునీత్ నాకు ఫోన్ చేసి చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలన్నది తన కోరిక అని..
Puneeth Rajkumar Last Wish: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన అభిమానులనే కాదు, సౌత్ ఇండియా సెలబ్రిటీలను సైతం షాక్‌కు గురి చేసింది. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా పునీత్ శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే!
ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన దర్శకుడు మెహర్ రమేశ్.. పునీత్ తన చిరకాల కల నెరవేరకుండానే కన్నుమూశారన్నారు. 'పునీత్ నాకు లైఫ్ ఇచ్చిన హీరో. ఆయన హీరోగా నటించిన 'వీర కన్నడిగ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాను. తర్వాత ఆయనతో మరో సినిమా కూడా చేశాను. నన్ను ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. 'భోళా శంకర్' సినిమా ప్రకటించినప్పుడు పునీత్ నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలన్నది తన కోరిక అని, ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరారు. అది కుదరకపోతే కనీసం ఏదైనా ఒక పాటలో మెగాస్టార్‌తో కలిసి చిన్న స్టెప్పు వేస్తానని అడిగారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది' అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.