Last wish
-
చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు
కథానాయకుడు, ప్రతినాయకుడు, సహాయ నటుడు... ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయిన అందాల నటుడు శరత్‌బాబు (71) ఇక లేరు. మూడు నెలల కిందట అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కిత్స తీసుకుని, బెంగళరు వెళ్లారు. అయితే మళ్లీ అస్వస్థతకు గురి కావటంతో బెంగళరులోని ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గత నెల 20న ఆయన్ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. శరత్‌బాబు శరీరంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వ్యాపించడంతో ఊపిరితిత్తులు, కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతినగా, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. చివరికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్! అదే చివరి కోరిక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళంలో శరత్‌బాబు చేసిన చివరి చిత్రం ‘వసంత ముల్లై’ (2023). ఈ నెల 26న విడుదలకు సిద్ధమైన ‘మళ్ళీ పెళ్లి’లో శరత్‌బాబు కీలక పాత్ర చేశారు. తెలుగులో ఆయనకు ఇదే చివరి సినిమా. వ్యక్తిగతంగా హార్సిలీ హిల్స్‌లో స్థిరపడాలనేది శరత్‌బాబు కోరిక. అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. అయితే నిర్మాణం పూర్తి కాలేదు. చివరికి శరత్ కోరిక నెరవేరలేదు. అదే చివరిరోజైంది... నటుడుగా బిజీగా ఉన్న సమయంలోనే శరత్‌బాబుకు హార్సిలీహిల్స్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లోనే హార్సిలీహిల్స్ కో–ఆపరేటివ్ బిల్డింగ్ సోసైటీలో సభ్యత్వం పొందారు. ఈ సభ్యత్వంతో 16–4–1985లో ఆయనకు కొండపై మానస సరోవరం పక్కన ఇంటి నివేశనస్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో అప్పట్లోనే ఇంటి నిర్మాణం ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో గోడల వరకే నిర్మాణం ఆపేశారు. ఈ ఇంటిని కొనుగోలు చేస్తామని, విక్రయించాలని పలువురు కలిసినా విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేసేవారు కాదు. ఇంటి నిర్మాణం పూర్తి చేయించకపోవడం, అలాగే వదిలేయడంతో దాన్ని సంరక్షించే బాధ్యతను స్థానిక వ్యక్తికి అప్పగించారు. అతను తరచూ ఫోన్లో శరత్‌బాబుతో మాట్లాడేవారు. శరత్‌బాబు ఏటా హార్సిలీహిల్స్ వచ్చి అసంపూర్తిగా ఉన్న ఇంటిని చూసుకుని, స్థానికులతో ముచ్చటించేవారు. ఆయన చివరగా 2021 మార్చి, 24న హర్సిలీహిల్స్ వచ్చారు. ఆరోజు తనకు పరిచయం ఉన్న స్థానికులతో మాట్లాడారు. పలు చిత్రాల్లో నటిస్తున్నానని, ఆ చిత్ర నిర్మాణాలు పూర్తయ్యాక హార్సిలీహిల్స్‌కు వచ్చేసి కుటుంబంతో ఇక్కడే ఉండిపోతానని అప్పుడు చెప్పారు. ఆ రోజు సాయంత్రం తిరిగి వెళ్లాక శరత్‌బాబు హార్సిలీహిల్స్ రాలేదు. ఆదే చివరిరోజైంది. -
తారకరత్న చివరి కోరిక ఇదే.. అది నెరవేరకుండానే!
నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్న ఆయన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. తారకరత్న రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. అటు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే లోకేశ్‌తో ఆ మధ్య భేటీ కూడా అయ్యారు. మర్యాదపూర్వక భేటీగా బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ పరిణామాలతో పాటు పోటీ చేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి తోడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి సిద్ధమయ్యాను, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని ఆయన ఓ సందర్భంలో చెప్పడంతో ఆ రూమర్స్ నిజమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే జోరుగా పర్యటనలు చేశారు. కానీ ఇంతలోనే చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఇంత చిన్నవయసులోనే తారకరత్నను తీసుకెళ్లి దేవుడు ఇంత అన్యాయం చేశాడేంటి? అని అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చదవండి: ఇంత చిన్నవయసులోనే వెళ్లిపోయావా?: తారకరత్న మృతిపై సంతాపం -
ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు!
సాక్షి, హైదరాబాద్: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. ప్రభాస్‌కు జోడీ కోసం వెతుకుతున్నామని, పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలో చెబుతామని అంటుండేవారు. ప్రభాస్ పెళ్లికంటే సంతోషాన్నిచ్చే అంశం తనకు మరొకటి లేదని చెప్పేవారు. వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలనుందని ఆయన కోరికను కూడా వెల్లడించారు. కానీ చివరకు ఇవేవీ నెరవేరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. దీంతో రెబల్ స్టార్ కుటుంబసభ్యులతో పాటు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తనకు అందరికంటే పెదనాన్న అంటేనే ఎక్కువ భయం, గౌరవం అని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కృష్ణంరాజు కూడా ప్రభాస్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును చూసి గర్వపడేవారు. ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాను కానీ, పాన్ ఇండియా స్టార్లా ఎదుగుతాడని అనుకోలేదని ఓ సందర్భంలో కృష్ణంరాజు అన్నారు. చదవండి: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత -
ఆ కల నెరవేరకుండానే కన్నుమూసిన పునీత్
Puneeth Rajkumar Last Wish: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన అభిమానులనే కాదు, సౌత్ ఇండియా సెలబ్రిటీలను సైతం షాక్‌కు గురి చేసింది. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా పునీత్ శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే! ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన దర్శకుడు మెహర్ రమేశ్.. పునీత్ తన చిరకాల కల నెరవేరకుండానే కన్నుమూశారన్నారు. 'పునీత్ నాకు లైఫ్ ఇచ్చిన హీరో. ఆయన హీరోగా నటించిన 'వీర కన్నడిగ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాను. తర్వాత ఆయనతో మరో సినిమా కూడా చేశాను. నన్ను ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. 'భోళా శంకర్' సినిమా ప్రకటించినప్పుడు పునీత్ నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలన్నది తన కోరిక అని, ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరారు. అది కుదరకపోతే కనీసం ఏదైనా ఒక పాటలో మెగాస్టార్‌తో కలిసి చిన్న స్టెప్పు వేస్తానని అడిగారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది' అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. -
భార్య చివరి కోరిక.. 17 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన భర్త !
ఉజ్జయినీ: మనకి ఇష్టమైన వాళ్ల కోరికలను తీర్చడానికి ఎన్నో చేస్తుంటాం. అదే కోరిక వాళ్లకి చివరిదైతే ఎలాగైనా తీర్చేందుకు సిద్ధపడుతాం. అలా ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 కేజీల బంగారన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని బొకారో నివాసి సంజీవ్ కుమార్, రష్మి ప్రభ భార్యాభర్తలు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయానికి రష్మి ప్రభ నిత్యం వెళ్లి అమ్మవారిని దర్శించుకునేది. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవలే చనిపోయింది. చనిపోయే ముందు ఆమె అమ్మవారికి తన నగలను సమర్పించాలని అదే తన చివరి కోరికగా భర్త సంజవీ కుమార్‌కు తెలిపింది. దీంతో తన భార్య చివరి కోరికను తీర్చేందుక ఆ వ్యక్తి తన భార్య ఆభరణాలు, 310 గ్రాముల బరువున్న నెక్లెస్‌లు, గాజులు, చెవిపోగులు సహా సుమారు రూ. 17 లక్షల విలువైన ఆభరణాలను అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు మీడియాకు వెల్లడించారు. చదవండి: Viral Video: భీకర గంగా ప్రవాహం.. క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్, అయితే.. -
TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్
ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాని ప్రార్థించారు. ఇక కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడ్డ టీఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(మే10)న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్' అనే షోతో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ టీఎన్ఆర్ ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ వేదికగా రామ్ గోపాల్ వర్మ, తేజ సహా ఎంతోమంది సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఒక్కోసారి 4 గంటలపాటు సుధీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. 1992లో దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న టీఎన్ఆర్ ఆ తర్వాత ఓ స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్’ చిత్రానికి సైతం స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత నటుడిగానూ తన ప్రస్థానం సాగించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే దర్శకుడిగా ఇండస్ర్టీలో తనదైన మార్క్ చూపించాలని టీఎన్ఆర్ కలలు కన్నారు. దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూడాలన్న కల తీరకుండానే తుదిశ్వాస విడాచారు. మానవ విలువలతో కూడిన మంచి కథతో ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టీఎన్ఆర్ అంటుండేవారని, అది తీరకుండానే వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి : కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ టీఎన్ఆర్ లాస్ట్ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు -
డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం..
లండన్ : జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న సామెతకు చక్కటి ఉదాహరణ బ్రిటన్‌కు చెందిన కెవిన్ మెక్‌గ్లిన్చి అనే 66 ఏళ్ల వ్యక్తి. పబ్ అంటే ఇష్టపడే ఈ పెద్ద మనిషి తన చివరి కోరికతో ఫ్యామిలీని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెవిన్ అడిగింది పిచ్చి కోరికైనా.. చివరి కోరిక కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని దాన్ని నెరవేర్చింది ఫ్యామిలీ. వివరాలు.. కెవిన్ మెక్‌గ్లిన్చికి కోవెంట్రీలోని ‘హోలీ బుష్’ పబ్ అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు. చావు దగ్గర పడ్డ కొద్దిరోజుల ముందు కుటుంబసభ్యుల్ని ఓ పిచ్చి చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్థికలను పబ్ ముందున్న డ్రైనేజీలో కలపాలన్నాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అతడి కోరికను అర్థంచేసుకున్నారు. మొదటి జయంతి రోజున కెవిన్ కుమారుడు ఓవెన్, కూతురు కాస్సిడీ ఇతర కుటుంబసభ్యులు హోలీబుష్ పబ్ దగ్గరకు చేరుకున్నారు. కెవిన్ మెక్‌గ్లిన్చి, ఓవెన్, కాస్సిడీ ఓవెన్ తండ్రి అస్థికలను ఓ గ్లాసు బీరులో కలిపి, దాన్ని పబ్‌ముందున్న డ్రైనేజీలో పారబోశాడు. దీంతో తండ్రి చివరి కోరిక తీరింది. దీనిపై ఓవెన్ మాట్లాడుతూ.. ‘‘ మా నాన్నకు హోలీ బుష్ పబ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. అక్కడి డ్రైనేజీలో తరచూ ఏదో ఒకటి పాడేసేవాడు. అవి ఎలాంటివంటే జుట్టు, గోర్లు లాంటివి. డ్రైనేజీలో ఆయన తన అస్థికలు ఎందుకు కలపమన్నారంటే.. మేము అటువైపు వెళ్లిన ప్రతీసారి గుర్తుకురావాలన్న ఉద్దేశ్యంతో’’ అని పేర్కొన్నారు. చదవండి : ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ మీకు!’ ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!
సాక్షి, న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు దోషులు తాము చనిపోయాక చేయాల్సిన పనుల గురించి జైలు సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు నెహాల్ బన్సాల్ ఉరికి గంట ముందు జైలుకి వెళ్లి దోషుల చివరి కోరికల గురించి తెలుసుకున్నారు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మరణానంతరం అవయవాలను దానం చేయాలని కోరాడు. అవయదానానికి అవసరమైన పత్రంపై కూడా సంతకాలు చేశాడని అధికారులు వెల్లడించారు. (చదవండి: జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!) అయితే ఉరి తీసిన అనంతరం అరగంటపాటు వారి శరీరాలను అలానే వేలాడదీయడంతో కీలక అవయవాలు దానానికి పనికిరావని తెలుస్తోంది. ముఖేష్ సింగ్ ఉరికి ముందు తనను ఉరి తీయొద్దంటూ బతిమాలాడుతూ, తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తెలుస్తోంది. మరో దోషి వినయ్ శర్మ కూడా తన మరణానంతరం.. జైల్లో ఉన్నప్పుడు తాను వేసిన పెయింటింగులను సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని కోరాడు. తాను చదివిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, తన ఫొటోగ్రాఫ్‌ను కుటుంబానికి అందించాలి కోరాడు. మిగతా ఇద్దరు పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ మాత్రం ఎలాంటి కోరికా కోరలేదని సమాచారం. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: ఆడపిల్లల రక్షణ విషయంలో యావత్ దేశాన్ని అభద్రతలోకి నెట్టివేసిన ఢిల్లీ నిర్భయ ఘటనలో దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉరితీయడానికి ముందు ఏ ఖైదీనైనా వారి ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనవాయితీ. తీహార్ జైలు అధికారులు సైతం ఈ నలుగురినీ ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నించగా నలుగురిలో ఏ ఒక్కరు కూడా సమాధానమివ్వకుండా మౌనాన్ని ఆశ్రయించారనీ, వారి సమాధానం కోసం వ్డేచి చూస్తున్నామని అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్‌కుమార్ వెల్లడించారు. నలుగురినీ రాతపూర్వకంగా తమ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు. (నిర్భయ కేసు : పిటిషనర్‌కు సుప్రీం చురకలు) ఒకసారి వారు నోరువిప్పి తమ చివరి కోరిక ఏమిటో చెపితే దాన్ని తీర్చగలుగుతామా లేదా అన్న విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తారని వ్యాఖ్యానించారు. ‘అయితే అన్ని కోర్కెలూ తీర్చే అవకాశం ఉండదు. ఖైదీలు తమ కోర్కెను రాతపూర్వకంగా ఇచ్చిన తరువాత దానిపై అధికారులు నిర్ణయం తీసుకొంటారు’అని తెలిపారు. కనీసం మీరు చివరిసారిగా ఎవరినైనా కలుసుకోవాలనుకుంటున్నారా? అనీ, మీ ఆస్తులను, మీకు సంబంధించిన వాటిని ఎవరికైనా అప్పజెప్పాలనుకుంటున్నారా అని కూడా వారిని ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులైన వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీచేసింది. (దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు!) చదవండి: కంగన మాటల్లో తప్పులేదు: నిర్భయ తల్లి ‘ఆమెను నిర్భయ దోషులతో కలిపి ఉంచాలి’ నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత ఒక్కొక్కరిని ఉరి తీయండి.. అప్పుడే: నిర్భయ తల్లి న్యాయమూర్తి అరోరా సుప్రీంకు బదిలీ నిర్భయ ఘటనలో దోషులకు మరణ శిక్ష విధించిన సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరాను డిప్యుటేషన్ ప్రాతిపదికన అదనపు రిజిస్ట్రార్‌గా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. అరోరా నిర్భయ కేసుతోసహా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దాఖలు చేసిన పలు కేసులను విచారించారు. (ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు) -
ఆఖరి కోరిక తీరకుండానే కల్పనా లాజ్మి..
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి నుంచి పుట్టే కళలు, మనిషిని అనుకరిస్తాయా? లేదా కళలనే మనిషి అనుకరిస్తాడా? అనే తాత్విక చర్చ ఎప్పటికీ ముగియనప్పటికీ, ఇటు కళలను, జీవితాన్ని వేరు చేయకుండా జీవించిన కల్పనా లాజ్మి జీవితం ఆదివారం నాడు ముగిసిన విషయం తెల్సిందే. ఆమె తీసిన సినిమాల్లోని స్త్రీ పాత్రల్లా ఆమె జీవితం కూడా వివాదాస్పదంగానే గడిచింది. 17 ఏళ్ల వయస్సులోనే 28 ఏళ్ల వయస్సు కలిగిన ప్రముఖ అస్సాం జానపద గాయకుడు భూపేన్ హజారికాతో ఆమె జీవితాన్ని పంచుకున్నారు. భార్యను, పుత్రుడిని దూరం చేసుకున్న హజారికాకు జీవితాంతం అంటే, 2011, నవంబర్‌లో ఆయన మరణించే వరకు ఆయనతో ఉన్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. భూపేన్ హజారికాను ‘పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే’ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులతోపాటు సంగీత్ నాటక్ ఫెల్లోషిప్ అవార్డుతో ఈ సమాజం సత్కరించింది. అదే ఆయనతోనే జీవితాన్ని పంచుకున్న కల్పనా లాజ్మికి మాత్రం విమర్శలను, ఛీత్కారాలనే ఇచ్చింది. 2006లో ఛింగారి చిత్రంతో తెరమరుగైన కల్పనా లాజ్మి సినిమా స్క్రిప్టు రైటర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా ఎంతో రాణించినప్పటికీ ఆమెకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. అయితే ఆమె తీసిన రుడాలి (1993)లో డింపుల్ కపాడియా, దమన్ (2001)లో రవీనా టాండన్‌లకు జాతీయ ఉత్తమ నటి అవార్డులు లభించాయి. లాజ్మి తీసిన తొలి చిత్రం ఏక్ ఫల్ (1986) కమర్శియల్‌గా హిట్టవడమే కాకుండా దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఏక్ ఫల్‌కు, రుడాలికి సంగీత దర్శకత్వం వహించిన హజారికాకు ఆమెకన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఆమె ఆఖరి సినిమా ఛింగారి సినిమా హిట్ కాలేదు. పేరూ తేలేదు. ఓ మాతృమూర్తిగా జీవితంలో మహిళలుపడే కష్టాలే ప్రధాన ఇతివృత్తంగా ఆమె సినిమాలు సాగుతాయి. సమాజంలోని నిజమైన పాత్రలే ఆమె సినిమాల్లో ప్రతిబింబించాయి. కిడ్నీ క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైనందుకు లాజ్మి ఏనాడు బాధ పడలేదు. అయితే తన ఆఖరి కోరిక తీరడం లేదనే ఆమె ఎక్కువ బాధ పడ్డారు. భూపేన్ హజారికా మరణించిన నాటి నుంచి ఆయన జీవితంపై బయోపిక్ సినిమాను నిర్మించడమే ఆమె ఆకరి కల. ఎంతో కష్టపడి స్క్రిప్టు కూడా రాసుకున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి ఆమె అనారోగ్యం సహకరించలేదు. త్వరలో కోలుకొని ఏనాటికైనా బయోపిక్ తీస్తానన్న నమ్మకంతోనే ఆమె ఎంతోకాలం బతికారు. ఇక అది సాధ్యం కాదని గ్రహించారేమో! ‘భూపేన్ హజారికా: యాజ్ ఐ నో హిమ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చారు. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 8వ తేదీన ముంబైలో కల్పనా లాజ్మి తల్లి లలితా లాజ్మి, దగ్గరి బంధువు శ్యామ్ బెనగల్, పలువురు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తు ఆమె ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు. -
అభిమాని ఆఖరి కోరిక తీర్చిన సూపర్ స్టార్
అభిమానులు లేనిదే హీరోలు లేరులే.. అన్న పాట రజనీకాంత్ నటించిన కుచేలన్ చిత్రంలో ఉంది. దీన్ని ఎంత మంది హీరోలు గ్రహిస్తారో గానీ, నటుడు రజనీకాంత్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన తరచూ తన అభిమానులను కలిసి వారికి సంతోషాన్ని కలిగిస్తుంటారు. నాగర్‌కోవిల్ సమీపంలోని కోట్టార్ వాగైయడి గ్రామానికి చెందిన అవినాష్ అనే 12 ఏళ్ల బాలుడు రజనీకాంత్‌కు వీరాభిమాని. 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని తల్లితండ్రులు స్వామినాథన్, లత కుమారుడి అవయవాలను దానం చేశారు. అవినాష్ తన అభిమాన నటుడు రజనీకాంత్ చిత్ర పటాన్ని పెన్సిల్‌తో చెక్కాడు. ఆ ఫొటోను రజనీకాంత్‌కు చూపించి దానిపై ఆయన సంతకం చేయించుకోవాలని ఆశ పడ్డాడు. ఆ కోరిక నెరవేకుండానే దుర్మరణం పాలయ్యాడు. తమ కుమారుడి ఆశను ఎలాగైనా నెరవేర్చాలని అతని తల్లిదండ్రులు భావించారు. ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా రజనీకాంత్‌కు తెలియజేశారు. ఆ లేఖ చదివిన రజనీకాంత్ ఇటీవల అవినాష్ తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు తమతో తీసుకొచ్చిన చిత్రపటాన్ని చూపించగా అందులో రజనీకాంత్ సంతకం చేశారు. అవయవదానం చేసిన మీ కుమారుడు ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని చెప్పి పంపారు. ఈ విషయం తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి కోరికను నెరవేర్చామన్నారు. ఇప్పుడు ఆత్మశాంతిస్తుందని భావిస్తున్నామన్నారు. -
క్యాన్సర్‌ను జయించిన ప్రేమ
వాషింగ్టన్ : ప్రాణాలు హరించే క్యాన్సర్ వ్యాధి వారి ప్రేమకు అడ్డుకాలేదు. ప్రమాదకర వ్యాధి భారిన పడి, ఎన్ని రోజులు జీవిస్తాడో తెలియని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. తనకు మాత్రం చివరి క్షణం వరకూ ప్రేయసితో మధుర క్షణాలు గడపాలనుకుంటున్నట్లు క్యాన్సర్ బాధితుడు చెప్పడం చూపరులను కంటతడి పెట్టించింది. అమెరికాకు చెందిన డస్టిన్ స్నైడర్(19) , సీరా సివేరియో(19)లు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఈ క్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే జూన్ 2016లో పుట్టినరోజు నాడు తన కుమారుడికి ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలియగానే షాక్‌కు గురయ్యామని స్నైడర్ తల్లి కసాండ్రా ఫాండా కన్నీటి పర్యంతమయ్యారు. కాలేయ క్యాన్సర్ కు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయిందట. కుమారుడు స్నైడర్ కేవలం కొన్నిరోజులే బతుకుతాడని డాక్టర్లు ఆమెకు చెప్పారు. ఈ బాధాకర విషయాన్ని కుమారుడికి చెప్పగా.. తన మనసులో మాటను బయటపెట్టాడు. చిన్ననాటి స్నేహితురాలు సీరా సివేరియోను వివాహం చేసుకోవాలన్నది తన చివరి కోరికగా తల్లికి చెప్పాడు. కొన్ని రోజుల కిందట తన మనసులో మాటను ప్రేయసి సివేరియోకు చెప్పాడు. ఆమెను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, అయితే తాను కేవలం కొద్దిరోజులు మాత్రమే బతుకుతానని వివరించాడు. కానీ బతికిన కొన్ని రోజులు నీతోనే సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నట్లు కళ్లల్లో నీటి సుడులు తిరుగుతుండగా చెప్పాడు. ఆమె స్నైడర్ తో ప్రేమపెళ్లికి ఒప్పుకుంది. గో ఫండ్ పేజ్ ద్వారా పెళ్లి ఏర్పాట్లకు కావలసిన విరాళాలు సేకరించారు. జనవరి 28న కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ప్రేయసి సివేరియో మాట్లాడుతూ.. నా స్నేహితుడు స్నైడర్ చివరిక్షణం వరకూ సంతోషంగా ఉండేలా చేసుకుంటాను. అతడికి చివరిక్షణాలు అద్భుతక్షణాలుగా మారాలని మేం ప్రయత్నిస్తున్నాం. మా పెళ్లి బట్టల కోసం షాపింగ్ కూడా చేశాం. పెళ్లికి సిద్ధంగా ఉన్నానని వివరించింది. -
తమ్ముడి చివరి కోరిక నెరవేర్చిన మహిళ
సేలం : పెద్దల ఆస్తి తోబొట్టువులకు ఇవ్వడానికే నిరాకరించే వారున్న ఈ రోజుల్లో ఓ మహిళ తన తండ్రి, తమ్ముడి చివరి కోరిక మేరకు రూ.కోటి విలువైన నాలుగున్నర ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈరోడ్ జిల్లా కాట్టూర్‌కు చెందిన రైతు చిన్ననాచ్చిముత్తు(75) గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు కుమార్తె ఈశ్వరి(52), కుమారుడు నటరాజన్(47) ఉన్నారు. నటరాజన్ అనారోగ్యం కారణంగా పదేళ్ల పాటు మంచానికే పరిమితమై 2014లో మృతి చెందాడు. నటరాజన్ చివరి రోజుల్లో తనకు వాటాగా వచ్చే ఆస్తిని తమ స్వగ్రామమైన ఈరోడ్ జిల్లా అమ్మాపాలయంలోని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలని తండ్రికి తెలిపి కన్నుమూశాడు. కుమారుడి చివరి కోరిక నెరవేర్చేందుకు చిన్ననాచ్చిముత్తు తన ఆస్తిలో నటరాజన్ వాటాగా రూ.కోటి విలువైన 4.60 ఎకరాల భూమిని అమ్మపాలయంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందే విధంగా వీలునామా రాసి కుమార్తె ఈశ్వరికి అప్పగించాడు. ఈ క్రమంలో చిన్ననాచ్చిముత్తు మృతి చెందడంతో ఆయన రాసిన వీలునామాను ఇటీవల ఈశ్వరి ఈరోడ్ జిల్లా చీఫ్ ఎడ్యుకేషన్ అధికారికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆమె మీడియాకు తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. ‘‘నా తండ్రి చిన్ననాచ్చిముత్తు చేనేత కార్మికుడు. అతి కష్టం మీద మమ్మల్ని చదివించాడు. నా తమ్ముడు నటరాజన్ ఈరోడ్‌లో ప్రైవేటు కళాశాలలో బీబీఎం చదువుకున్నాడు. ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ నేరుగా వెళ్లి చదువుకోలేని పరిస్థితిలో పోస్టల్‌లోనే ఎంబీఎ, ఎంఫిల్‌ను చదువుకున్నాడు. పీహెచ్డీ పూర్తి చేసి, ఉద్యోగం చేయాలనేదే నా తమ్ముడి కోరిక. అది నెరవేరకుండానే అనారోగ్యంతో మృతి చెందాడు. తమ్ముడి చివరి కోరిక మేరకు అతని వాటాగా వచ్చిన స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులకు అప్పగించాను’’ అని అన్నారు. గ్రామస్తుల స్పందన ఈశ్వరి కావాలనుకుంటే తండ్రి వీలునామాను దాచి ఆస్తిని తానే అనుభవించి ఉండొచ్చని, అయితే తండ్రి, తమ్ముడి చివరి కోరికను నెరవేర్చిన ఈశ్వరికి అభినందనలు తెలిపారు. -
బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన ఐదేళ్ల చిన్నారి
స్కాట్లాండ్: వ్యాధులతో సతమతమవుతూ కొన్ని రోజులు మాత్రమే బతుకుతారని తెలిసిన వారికి చివరి కోరికను తీర్చడం తరచుగా వింటుంటాం. అలాగే స్కాట్లాండ్ కి చెందిన ఐదేళ్ల చిన్నారి చివరి కోరిక ఏంటని ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. కొందరు బంధువుల సమక్షంలో చిన్నారికి ఆమె కోరిన బాలుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఆ వివరాలివి.. స్కాట్లాండ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలీధ్ పాటర్సన్. కొంతకాలంగా భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు తేల్చేశారు. చిన్నారి కోరికలను తీర్చి బతికున్నంతకాలం పాపను సంతోషంగా ఉండేలా చూడాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. అందరు పిల్లల్లాగే తన కూతురు బొమ్మలు, చాక్లెట్లు, ఇతర ఆట వస్తువులు లాంటివి అడుగుతుందని ఇలీధ్ పాటర్సన్ పేరెంట్స్ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తనకు తన కోరికల చిట్టాలో పెళ్లిని మొదటి కోరికగా వెల్లడించింది. దీంతో షాకవ్వడం ఇలీధ్ పేరెంట్స్ వంతయింది. తన బెస్ట్ ఫ్రెండ్ హ్యారిసన్ గ్రేర్ తో పెళ్లి చేయాలని కోరింది. ఈ విషయాన్ని హ్యారిసన్ తండ్రి బిల్లికి తెలపగా పాప సంతోషం కంటే తమకు ఏదీ ఎక్కువకాదని చెప్పారు. చిన్నారిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి బంధువులు, సన్నిహితుల సమక్షంలో హ్యారిసన్ తో వివాహం జరిపించారు. తమ పాపకు హ్యారిసన్ ఇంటే ఇష్టమని, అయితే ఈ స్థాయిలో ప్రేమ ఉందని తెలియదని ఇలీధ్ తల్లిదండ్రులు చెప్పారు. ఇలీద్ పరిస్థితి చెప్పి హ్యారిసన్ ను పెళ్లికి ఒప్పించినట్లు అతడి తండ్రి బిల్లీ వివరించారు. -
తల్లి కోసం.. ఒక్కటై
శ్రీశైలం (జూపాడుబంగ్లా): కాశీ, గయా, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలతోపాటు గోదావరి పుష్కర స్నానం అచరించిన 90 ఏళ్ల పిడూరు సుశీలమ్మ చివరిపర్యాయంగా కృష్ణాపుష్కరాలు చేసేందుకు కుటుంబసభ్యులతో శనివారం శ్రీశైలం తరలివచ్చారు. తల్లి చివరి కోరికను తీర్చేందుకు ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆమె రెండో కుమార్తె పుష్పలత తోపాటు హైదరాబాదులో నివాసం ఉంటున్న పెద్దకుమార్తె సుబ్బారత్నం, మూడోకుమార్తె లత, నాలుగోవకుమార్తె వేదావతి, పెద్దకుమారుడు సుబ్బారావు, రెండోకొడుకు సుధాకర్‌లతోపాటు కృష్ణాపుష్కరస్నానం చేసేందుకు లింగాలగట్టు దిగువఘాటుకు చేరుకున్నారు. ఈసందర్భంగా వారిని ‘సాక్షి’పలకరించగా జన్మనిచ్చిన తల్లి కోర్కెను తీర్చేందుకు తాము శ్రీశైలంలో పుష్కరస్నానం చేసి స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చినట్లు తెలిపారు. -
తల్లి చివరి కోరిక కోసం..
కర్ణాటకలో కేన్సర్‌తో బాధపడుతున్న ఓ తల్లి.. తన కొడుకును ఓ చిత్రమైన కోరిక కోరింది. అతడు కూడా దాన్ని తీర్చడానికి కాస్త కష్టపడినా.. చివరకు తీర్చాడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడకు గ్రామ నివాసి లలితమ్మ కేన్సర్ బాధితురాలు. ఆ తల్లి వెల్లడించిన తన చివరి కోరికను ఆమె కుమారుడు కిరణ్‌కుమార్ నెరవేర్చాడు. జేడీఎస్ పార్టీలో కొనసాగుతున్న కిరణ్‌కుమార్ తల్లి లలితమ్మకు తాను చనిపోయేలోగా జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ.కుమారస్వామిని ఒకసారైనా చూడాలన్న కోరిక కలిగింది. ఆ కోరిక గురించి కిరణ్‌కుమార్ తమ పార్టీ అధ్యక్షునికి ఫోన్లో వివరించగా, చెళ్లకెరె పర్యటనకు వచ్చిన ఆయన అందుకు సమ్మతించి, వెంటనే తల్లితో కలిసి చెళ్లకెరె బయలుదేరి రావాలని సూచించారు. దీంతో ఆయన చెళ్లకెరెలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తర్వాత అక్కడకు వచ్చిన లలితమ్మను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుమారస్వామితో మాట్లాడినందుకు తనకు ఎంతో సంతోషం కలిగిందని లలితమ్మ ఆనందం వ్యక్తం చేసింది. -
నా చివరి కోరిక ఇదే!
హాలీవుడ్ సినిమాలను అమితంగా ఇష్టపడే షారుక్‌ఖాన్‌కు ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌లంటే చాలా ఇష్టం. ఈ సిరీస్ సినిమాలను ఆయన లెక్కలేనన్ని సార్లు వీక్షించారట! ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ హీరో ఈథెన్ హంట్, జేమ్స్ బాండ్లు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలనేది షారుక్ చిరకాల వాంఛ. ఈ విషయమై షారుక్ మాట్లాడుతూ ‘‘నా సీక్రెట్ ఫాంటసీ ఏంటంటే... ఈ రెండు పాత్రలను ఒకే సినిమాలో చూడాలని ఉంది. అలాంటి సినిమా వస్తే నా ఆనందానికి హద్దే ఉండదు. నా చివరి కోరిక కూడా ఇదే. ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మరి ఆయన కోరిక తీరుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.