పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్‌ | Puneeth Rajkumar Final Rites: Balakrishna Emotional Video Goes Viral | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్‌

Published Sat, Oct 30 2021 12:28 PM | Last Updated on Sat, Oct 30 2021 5:56 PM

Puneeth Rajkumar Final Rites: Balakrishna Emotional Video Goes Viral - Sakshi

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండే పునీత్‌ గుండెపోటుతో మరణించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. తమ అభిమాన హీరో ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ చివరిచూపు కోసం కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో షాక్ అయిన టాలీవుడ్‌ హీరోలు బెంగళూరు వెళ్తున్నారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు)

బాలకృష్ణ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య ఎమోషనల్‌ అయ్యాడు. పునీత్‌ పార్థీవ దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెడుతూ పక్కకి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పునీత్ మరణం వ్యక్తిగతం తనకు తీరని లోటు అని అన్నారు. 


బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు అంటే  పునీత్‌కు ఎంతో అభిమానం. గతంలో కర్ణాటకలో జరిగిన ఓ వేడుకకు బాలకృష్ణ హాజరవ్వగా.. ఆ సమయంలో వారిద్దరి మధ్య అనుబంధంకి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. బాలకృష్ణ ముఖానికి ఏదో అంటుకుంటే గుర్తించిన పునీత్‌ రాజ్‌కుమార్‌ దానిని శుభ్రం చేశారు. ఆ వీడియో ఈ సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement