
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కన్నుమూసి వారం రోజులు గడుస్తున్నా ఆయన లేరనే చేదు నిజాన్ని కన్నడీగులు జీర్ణించుకోలేకపోతున్నారు. వందల సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద ఆయన సమాధిని దర్శించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఆయన మరణం.. మరికొందరికి అవకాశంలా మారింది.
చదవండి: కన్నీరు పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెయింటింగ్..
గుండెపోటుతో కారణంగా మరణించిన పునీత్ మృతిని కొందరు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు బెంగళూరులోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌యే ఉదాహరణ. ఒకపక్క పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూనే మరోపక్క ఆయన పేరుతో సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ క్యాష్ చేసుకోవడం చూసి ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంగతేంటంటే.. సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ అప్పు మృతికి సంతాపం తెలుపుతూ ఫ్లెక్సీ పెట్టింది. అంతేగాక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె, ఇతర చెకప్‌లు ఉచితంగా చేస్తామని ప్రకటించింది.
చదవండి: మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. దాని కింద కాస్తా గమనించి చూస్తే మీరు కూడా మండిపడక తప్పదు. ఇంతకి అదేంటంటే.. ‘మా వద్దకు బీపీ. ఈసీజీ, క్రెటిన్ లైన్, కొలస్ట్రాల్ చెకప్స్ చేయించుకుంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అంటూ ప్రకటన యాడ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు, పునీత్ ఫ్యాన్స్ ఇలాంటి సమయంలో కూడా ఓ మనిషి ఇంత నీచంగా ఆలోచిస్తాడంటూ మండిపడుతున్నారు.
ಎಲ್ಲದರಲ್ಲೂ ಲಾಭ ಹುಡುಕುವ ರಣಹದ್ದುಗಳು!! pic.twitter.com/g6JwxwTwMX
— ಮಂಜುನಾಥ್ ಜವರನಹಳ್ಳಿ (@manjujb1) November 2, 2021