Prakash Raj Satirical Reaction On Chandrakant Patil Comments Over PM Modi - Sakshi
Sakshi News home page

Prakash Raj: ప్రధాని మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Mar 22 2022 9:11 PM | Last Updated on Wed, Mar 23 2022 12:24 PM

Prakash raj Satirical Comments On PM Narendra Modi On Twitter - Sakshi

Prakash Raj Satirical Comments On Modi: నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్‌ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అన్న వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైరికల్‌గా స్పందించాడు.

చదవండి: భార్యతో స్టార్‌ హీరో రొమాంటిక్‌ డేట్‌, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా..

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం విధితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement