Prakash Raj Satirical Comments On PM Modi Hyderabad Visit, Posts Goes Viral - Sakshi
Sakshi News home page

సుప్రీం లీడర్‌ అంటూ మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు.. ఫొటోలతో పోస్టు

Published Sat, Jul 2 2022 12:13 PM | Last Updated on Sat, Jul 2 2022 1:01 PM

Prakash Raj Indirect Satires On Prime Minister Modi - Sakshi

విలక్షణ నటుడు, రాజకీయ నేత ప్రకాశ్‌ రాజ్‌.. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు హైదరాబాద్‌ చేరుకుంటున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో బీజేపీ, మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా.. తెలంగాణలో అద్భుత పాలన నడస్తున్నది చెబుతూ.. హైదరాబాద్‌కు వస్తున్నఅత్యుత్తమ నాయకుడికి స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలను సైతం ప్రస్తావించారు. 

మోదీ పర్యటిస్తున్న సమయంలో బీజేపీ పాలిత స్టేట్స్‌లో ప్రజలు కట్టిన పన్నుల మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారు. కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఫొటోతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో కూడిన ఫొటోలను షేర్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement