ప్రకాశ్‌రాజ్‌ మౌనవ్రతం..దానికోసమే అంటూ ట్వీట్‌ | Prakash Raj Will Be In Silence Mode For A Week Tweet Viral | Sakshi
Sakshi News home page

Prakash Raj: వారం రోజుల పాటు ప్రకాశ్‌రాజ్‌ విశ్రాంతి

Published Mon, Nov 15 2021 7:59 PM | Last Updated on Mon, Nov 15 2021 8:23 PM

Prakash Raj Will Be In Silence Mode For A Week Tweet Viral - Sakshi

Prakash Raj Will Be In Mouna Vratha For A Week: ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాశ్‌రాజ్‌..వారం రోజుల పాటు మౌనం వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే ఇదేదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు. ఇటీవలె కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్‌రాజ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా వోకల్‌  కార్డ్స్‌కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సూచించారట.

దీంతో వారం రోజుల పాటు మౌన వ్రతం అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు..గెట్‌ వెల్‌ సూన్‌ సర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవ‌లే సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన జైభీమ్‌ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ ఓ వ్యక్తిని కొట్టే సీన్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement