సాక్షి, బెంగళూరు: తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘‘ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. మానమర్యాదలను అమ్ముకున్నవాళ్లు.. ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారు’’ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిన్న(గురువారం) సాయంత్రం ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీజేపీపై ఆగ్రహం.. ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ప్రసంగంతో పాటు మీడియాకు సమర్పించిన వీడియోలను కూడా ప్రకాష్ రాజ్ ట్యాగ్, పోస్ట్ చేశారు.
మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా చేధించడం.. ఆపై కేసు నమోదు విచారణ.. కోర్టుకు చేరిన వ్యవహారం, తదనంతర పరిణామాలు.. ఈలోపు మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.
Shameless Brokers from Delhi..killing democracy ಮಾನ ಮರ್ಯಾದೆ ಮಾರಿಕೊಂಡವರು.. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನೇ ಹಾರಾಜಿಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ.. #LotusLeaks #justasking pic.twitter.com/w516YyTpoI
— Prakash Raj (@prakashraaj) November 4, 2022
Comments
Please login to add a commentAdd a comment