Prakash Raj Comments On The Kashmir Files Movie: నిజ సంఘటనల ఆధారం బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్రి హోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనూహ్య స్పందన వస్తోంది. జమ్మూకశ్మీర్‌లో 1990లలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను ఈ చిత్రంలో చూపించారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ సంచలనం సృష్టిస్తోంది. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం
'కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ప్రధాని మోదీ నుంచి ఎందరో బీజేపీ నేతలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి కొన్ని రాష్ట్రాలు బెనెఫిట్స్ షోలను కూడా ప్రకటించాయి. కాగా ఈ మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర హోంశాఖ 'వై' కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు.
చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు
#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA
— Prakash Raj (@prakashraaj) March 18, 2022
Comments
Please login to add a commentAdd a comment