
బెంగళూరు: అన్నీ 420 పనులు చేసి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకుపైగా గెలుస్తామనడం కేవలం మూర్ఖత్వమేనని బీజేపీని ఉద్దేశించి సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ సహా ఏ పార్టీ చేసినా అది మూర్ఖత్వమేనన్నారు. కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూర్ ప్రెస్‌క్లబ్‌లో ప్రకాష్‌రాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ ఒంటరిగా 400కుపైగా సీట్లు గెలిచే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.
ప్రజలు గెలిపిస్తేనే ఎవరైనా గెలుస్తారని చెప్పారు. ఇన్ని సీట్లు తీసుకుంటామని ఏ పార్టీ చెప్పడానికి వీల్లేదన్నారు. కాగా, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మాట్లాడుతూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏ 400కుపైన సీట్లు గెలుస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనూ అబ్ కీ బార్ చార్ సౌ పార్( ఈసారి 400కుపైన) అనే నినాదాన్ని బీజేపీ ఇస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment