
సాక్షి, చెన్నై : అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీ పెట్టేవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా. పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో పొత్తు అనేది నా నిర్ణయమే. బీజేపీ నన్ము నమ్ముకుని ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను కాషాయరంగును దగ్గరకు రానివ్వను’అని రజనీ పేర్కొన్నారు.
(చదవండి : అయోధ్యలో నిశ్శబ్దం)
Comments
Please login to add a commentAdd a comment