మెరుపు వేగంతో... | thamil star vijay special story | Sakshi

మెరుపు వేగంతో...

Mar 27 2016 10:46 PM | Updated on Sep 3 2017 8:41 PM

మెరుపు వేగంతో...

మెరుపు వేగంతో...

తమిళ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ హీరో విజయ్ అని అక్కడివాళ్లు అంటుంటారు.

తమిళ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ హీరో విజయ్ అని అక్కడివాళ్లు అంటుంటారు. అక్కడ తిరుగు లేని హీరో అనిపించుకున్న విజయ్ ‘తుపాకీ’ ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘కత్తి’ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘తెరి’ తెలుగులోకి విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ‘తెరి’ నిర్మాత ‘కలైపులి’ థానుతో కలిసి ‘దిల్’ రాజు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

తెరి అంటే మెరుపు అని అర్థం. ఇది యాక్షన్ థ్రిల్లర్. ఆ మధ్య తమిళంలో ‘రాజా రాణి’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీకి దర్శకత్వం వహించిన అట్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘‘ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగు టైటిల్, పాటల విడుదల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ‘దిల్’ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సమంత, అమీజాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: జార్జ్ సి. విలియమ్స్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాతలు: ‘దిల్’రాజు, కలైపులి ఎస్ థాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement