
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు ఇటీవలె మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంతార-2 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా నటించనుంది.
ఈ మేరకు స్వయంగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో డైరెక్టర్ రిషబ్ శెట్టితో కలిసి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘కాంతారా2’లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఊర్వశీ హీరోయిన్‌గా నటిస్తుందా లేక కీలక పాత్రలో చేయనుందా అన్న సందేహం నెలకొంది. ప్రస్తుతం ఊర్వశీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment