
ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతున్నారు.
తాజాగా బుజ్జి కారును కాంతార హీరో రిషబ్ శెట్టి నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. బుజ్జి కారును ఇప్పటికే పలువురు సినీతారలు డ్రైవ్ చేశారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కల్కి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/IvIHuxGO6y
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2024
Comments
Please login to add a commentAdd a comment