Prabhas Review On Kantara Movie, Says It Is Must Watch Film In Theatres - Sakshi
Sakshi News home page

Prabhas On Kantara: ‘కాంతారా’పై ప్రభాస్‌ రివ్యూ.. రెండు సార్లు చూశా.. థ్రిల్లింగ్‌ క్లైమాక్స్‌

Published Sat, Oct 15 2022 2:49 PM | Last Updated on Sat, Oct 15 2022 3:18 PM

Prabhas Review On Kantara Movie - Sakshi

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి నటించిన తాజా చిత్రం ‘కాంతారా’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు థియేట్రికల్‌  రైట్స్‌ని  అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా నేడు(అక్టోబర్‌ 15) విడుదల చేశారు. 

(చదవండి: ‘కాంతారా’ మూవీ రివ్యూ)

ఈ సినిమాపై స్టార్‌ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే హీరో ధనుష్‌, రానా సోషల్‌ మీడియా వేదికగా ‘కాంతారా’పై ప్రశంసలు కురిపించారు. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా ఆ జాబితాలో చేరాడు. తాజాగా ‘కాంతారా’ మూవీని వీక్షించిన ప్రభాస్ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “కాంతారా ఒక అద్భుతమైన మూవీ. ఇప్పటికి నేను ఈ మూవీని రెండుసార్లు చూశాను. మంచి కాన్సెప్ట్ తో, అదిరిపోయే క్లైమాక్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను  థియేటర్స్‌లో తప్పక చూడాలి’అంటూ సినిమా పోస్టర్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement