లాక్‌డౌన్ అనంతరం పరిస్థితులు మారాయి. ముఖ్యంగా చలన చిత్ర రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. కరోనా అనంతరం ప్రేక్షకుల్లో సినిమాను చూసే కోణం మారింది. భారీ బడ్జెట్, ఫైట్స్, పెద్ద హీరోలు ఉంటేనే సినిమా ఆడుతుందనేత పాత ముచ్చట.. ఇప్పుడు కథలో దమ్ముండాలే కాని చిన్న సినిమా అయితే ఏంటీ! కొత్త నటులు అయితే ఏంటీ? అంటున్నారు ఆడియన్స్. దానికి ఇటీవల వచ్చిన బలగం, కాంతార చిత్రాలే ఉదాహరణ. కాంతార స్ఫూర్తితోనే వచ్చింది బలగం మూవీ. అలా ప్రాంతీయ సినిమాలకు పుంతలు వేసిన కాంతార సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఓ రీజనల్ సినిమా ప్రపంచాన్ని మెప్పించిందటే అది సాధారణ విషయం కాదు. ఐక్యరాజ్య సమితీలో సైతం కాంతార చిత్రాన్ని ప్రదర్శించారంటే అది ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు...
కర్ణాటకలోని తుళునాడు ఆదివాసిల సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈసినిమా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి భూతకోల ఆచారంలో భాగంగా పంజుర్లిగా మారి ‘ఓఁ’ అంటూ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ఆయన నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో అసలు భూతకోల అంటే ఏంటీ? దీని సంప్రదాయమేంటో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తికని కనబరిచారు. అయితే కర్ణాటకలో ఈ భూతకోల ఆచారం పుట్టడానికి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం!
భూతకోల... కర్ణాటకలోని తుళునాడు ఆదివాసిల ముఖ్యమైన సంస్కృతి, సంప్రదాయం ఇది. ముఖ్యంగా ప్రకృతి-మానవాళి మధ్య మంచి సత్సంబంధాల ఉంటేనే మనుగడ సాధ్యమని కాంతార ద్వారా చాటిచెప్పాడు రిషబ్ శెట్టి. కర్ణాటకలో ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవం ప్రకృతికి దగ్గరగా ఉండాలని చెబుతుంది. పూర్వం తుళునాడులో అడవి పందులు ఎక్కువడగా ఉండేవట. అవి రాత్రిళ్లు సంచరిస్తూ అలా స్థానికంగా ఉన్న పంటలను నాశనం చేస్తుండేవట. అలా ఓ పంది తన పంటను నాశనం చేసిందనే కోపంతో దాన్ని చంపేశాడట ఓ రైతు. కొంతకాలనికి పందిని చంపినందుకు ఆ రైతు తీవ్ర మనోవేదనకు గరయ్యాడట. దీంతో ఆ పంది ఆత్మను పూజించడం ప్రాంరభించాట. అలా తుళునాడు ఆదివాసిలంతా వరాహాన్ని దైవంగా కొలిచేవారట.
దీనిలో భాగంగానే వరహాన్ని కొలిచేందుకు ఈ భూతకోలను ప్రతిఏటా నిర్వహించేవరట. అలా ఈ సంస్కృతి పుట్టిందని కొందరు చెబుతుంటారు. అలాగే మరోకంటి ఏంటంటే.. ఓ మగ, ఆడ పంది కలిసి సుబ్రహ్మణ్వేశ్వర ఆలయానికి వెళ్లి ప్రార్థంచగా.. వాటి భక్తికి ప్రత్యక్షమైన స్వామి ఓ వరం కోరుకోమన్నాడట. వాటి కోరికను సుబ్రమణ్య స్వామి నెరవేర్చాడని, ఆయన ఇచ్చిన వరం ప్రకారం వాటికి నాలుగు పిల్ల పందులు పుట్టాయట. ఆ పంది పిల్లల్లో ఒకటి ఈశ్వరుడి తోటలో ప్రవేశించి అక్కడ సంచరిస్తుండగా పార్వతి దేవి దానిని చూసింది. చూడగానే ఆ పంది పిల్ల పార్వతి దేవికి నచ్చిందట. దీంతో శివుడు దానికి దేవికి కానుకగా ఇచ్చాడట. ఆ తర్వాత కైలాసం ఆ పంది పిల్ల తోటలన్నింటిని నాశనం చేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు ఆ పందిని పిల్లని చంపేశాడట.
ఆ ఘటనతో బాధపడ్డ పార్వతి దేవి ఆ పందిని తిరిగి తీసుకురావాలని కోరడంతో పరమేశ్వరుడు దానికి ప్రాణం పోసి, దైవిక శక్తిని ప్రసాదించి, పంజుర్లిగా భూమ్మీదకు పంపించాడని అక్కడ ప్రజలు అంటుంటారు. అప్పటి నుంచి మానవులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ దైవరూపాన్ని ప్రార్థిస్తే పరిష్కారం లభిస్తుందనేది తుళునాడు ప్రజల విశ్వాసం. ప్రాంతాన్ని బట్టి అన్నప్ప పంజుర్లి, కద్రి పంజుర్లి, కాంతవర పంజుర్లి.. ఇలా పేర్లు మారుతూ ఉంటాయి. ఆ దైవాన్ని పూజించే ప్రత్యేక సంగీత నాట్యకళే భూతకోల. దానికి దైవ కోల, నేమ అనే పేర్లూ ఉన్నాయి. పంజుర్లితోపాటు క్షేత్రపాలకుడిగా గుళిగను కూడా శివుడు పంపించాడని, తప్పు చేసిన వారిని పంజుర్లి వదిలిపెట్టినా గుళిగ వదలదు అని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment