కాంతార.. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూత కోలా సాంప్రదాయం గురించి కాంతార సినిమాలో రిషబ్ చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.
(చదవండి: చిక్కుల్లో కాంతార టీమ్.. లీగల్ నోటీసులు)
తాజాగా ఈసినిమా చూసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన రాజశేఖర్(45) అనే వ్యక్తి థియేటర్‌లో ఈ సినిమా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో థియేటర్ యాజమాన్య వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగా అతను మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న విడుదల చేశాడు. రిషబ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్‌కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment