
ఓటీటీ రిలీజ్‌పై ఎంతో సస్పెన్స్ నెలకొంది. చివరికి ఈ ఎదురుచూపులకు తాళం వేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. రేపటి నుంచి ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.
కంటెంట్ ఉంటే కలెక్షన్లు వాటంతటవే వస్తాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ కాంతార. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆల్‌రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు సైతం వన్స్‌మోర్ చూసేద్దామని రెడీ అవుతున్నారు. కానీ ఓటీటీ రిలీజ్‌పై ఎంతో సస్పెన్స్ నెలకొంది. చివరికి ఈ ఎదురుచూపులకు తాళం వేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. రేపటి(నవంబర్ 24) నుంచి కాంతార చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ మూవీ తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.
putting an end to all the wait!!! 🤯#KantaraOnPrime, out tomorrow@hombalefilms @shetty_rishab @VKiragandur @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/HBsEAGNRbU
— prime video IN (@PrimeVideoIN) November 23, 2022