కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ! | Kantara 2: Rishab Shetty Kantara Prequel Budget Goes Viral In Sandalwood - Sakshi
Sakshi News home page

Rishab Shetty Kantara: కాంతార ప్రీక్వెల్.. భారీ ప్లాన్‌తో వస్తోన్న రిషబ్ శెట్టి!

Published Tue, Sep 26 2023 7:07 PM | Last Updated on Tue, Sep 26 2023 7:57 PM

Rishab Shetty Kantara Prequel Budget Goes Viral In Sandalwood - Sakshi

రిషబ్‌ శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కించిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ సక్సెస్‌తో రిషబ్ శెట్టి మరో సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతారం-2 తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సైతం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.     

అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కాంతార- 2' బడ్జెట్‌ పైనే చర్చ జరుగుతోంది. సాధారణంగా సూపర్ హిట్‌ అయినా సినిమాలకు సీక్వెల్ రూపొందించడం మనం చూసుంటాం. కానీ అందుకు భిన్నంగా రిషబ్ శెట్టి ప్రీక్వెల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 

(ఇది చదవండి: టాలీవుడ్‌లో సూపర్‌ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!)

ఈ నేపథ్యంలోనే కాంతార-2 ప్రీక్వెల్‌ను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దాదాపు రూ.125 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర భాషల నటీనటులను తీసుకోవడంతో పాటు.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్ సైతం ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. అందుకే సినిమా బడ్జెట్ రేంజ్ కూడా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కాగా.. కాంతార పార్ట్-1 షూటింగ్ ఎక్కువ భాగం రిషబ్ స్వగ్రామమైన కుందాపూర్‌లోనే జరిగింది. అయితే రెండో భాగాన్ని మంగళూరులో చిత్రీకరించనున్నారు. సినిమాలో భూత కోల పూజను మరింత లోతుగా చూపించనున్నారు. వచ్చే ఏడాది 2024 చివర్లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

(ఇది చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. అసలు నిజమేంటి? )

రిషబ్ శెట్టి గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంతార- 2కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రకృతి నేపథ్యంలో తెరకెక్కిన తొలిభాగం కథ ఎక్కడ, ఎలా మొదలైందనేది ప్రీక్వెల్‌లో చూపిస్తామని తెలిపారు. పంజర్లీ దేవుడికి సంబంధించిన మరిన్ని సన్నివేశాలు ఉంటాయని అన్నారు. కాగా.. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement