ఇటీవల దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిన పేరు కాంతార. కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్ల రాబట్టింది. కన్నడ సంస్కృతి భూత కోల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చదవండి: విన్నింగ్ ప్రైజ్‌మనీతో పాటు రేవంత్ 15 వారాల పారితోషికం ఎంతంటే!
దీంతో సాంప్రదాయ నృత్యం భూత కోల వేడుక దేశవ్యాప్తంగా ఆసక్తిని సంతరించుకుంది. ఈ సంస్కృతిని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిని చూపారు. ఈ నేపథ్యంలో భూత కోల నృత్యానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రీసెంట్‌గా ప్రముఖ హీరోయిన్, ‘స్వీటీ’ అనుష్క శెట్టి ఈ భూత కోల వేడుకలో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీర్వదం తీసుకుంది అనుష్క. ఈ సందర్భంగా స్వీటీ ఈ వేడుకను తన ఫోన్ కెమెరాలలో వీడియో తీస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియోను ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
చదవండి: అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha
— PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022
Comments
Please login to add a commentAdd a comment