
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఒక్క సినిమాతో స్టార్ హీరో క్రేజ్‌ను దక్కించుకున్నారు. కన్నడలో కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండటంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
దర్శకత్వంతో పాటు స్వయంగా నటించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో కాసేపట్లోనే అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
రిషబ్ శెట్టి-ప్రగతిలది ప్రేమ వివాహం. కామన్ ఫ్రెండ్ ద్వారా ఫేస్‌బుక్‌తో మొదలైన సాన్నిహిత్యం పెళ్లి వరకు వెళ్లింది. వీరికి కొడుకు రన్విత్, కూతురు రాధ్య ఉన్నారు. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment