భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కాంతార’ చిత్రం ఇప్పుడు విదేశీ ఆడియన్స్‌ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. సప్తమి గౌడ హీరోయిన్. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు.
సుమారు 20కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకుల లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ మూవీని విదేశాల్లో కూడా రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. స్పానిష్, ఇటాలియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయని, థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment